తెలంగాణ

telangana

ETV Bharat / business

లాభాలు ఒక్కరోజు ముచ్చటే.. 10వేల దిగువకు సెన్సెక్స్

stock markets today
నేటి స్టాక్ మార్కెట్లు

By

Published : Jun 11, 2020, 9:59 AM IST

Updated : Jun 11, 2020, 3:51 PM IST

15:46 June 11

ఫెడ్​ అంచనాలతో అమ్మకాల ఒత్తిడి

స్టాక్ మార్కెట్లకు లాభాలు ఒక్క రోజు ముచ్చటగానే మిగిలాయి. బుధవారం లాభాలతో ముగిసిన సూచీలు.. గురువారం భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థపై ఫెడ్ ప్రతికూల అంచనాలు ప్రకటించిన నేపథ్యంలో విదేశీ మదుపరులు అమ్మకాలపై దృష్టిసారించారు.  

గురువారం సెషన్​లో సెన్సెక్స్ 709 పాయింట్లు నష్టపోయి 33,538 వద్దకు పడిపోయింది. నిఫ్టీ 214 పాయింట్లు కోల్పోయి 9,902 వద్ద స్థిరపడింది.

ఇండస్​ఇండ్ బ్యాంక్, హీరో మోటోకార్ప్, పవర్ గ్రిడ్, నెస్లే, ఎం&ఎం షేర్లు మాత్రమే గురువారం లాభాలను నమోదు చేశాయి.  

ఎస్​బీఐ, సన్​ఫార్మా, మారుతీ, బజాజ్ ఫినాన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, టాటా స్టీల్ షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.

15:02 June 11

సెన్సెక్స్ 680 పాయింట్లు పతనం..

స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ ఏకంగా 680 పాయింట్లకుపైగా కోల్పోయి 33,562 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ దాదాపు 200 పాయింట్ల నష్టంతో 9,920 వద్ద ట్రేడింగ్ సాగిస్తోంది.

  • 30 షేర్ల ఇండెక్స్​లో ఇండస్​ఇండ్ బ్యాంక్, హీరో మోటోకార్ప్, పవర్​గ్రిడ్, బజాజ్ అటో, నెస్లే, ఎం&ఎం మినహా మిగతా అన్ని కంపెనీల షేర్లు నష్టాల్లో ఉన్నాయి.
  • ఎస్​బీఐ అత్యధిక నష్టంతో ట్రేడవుతోంది. సన్​ఫార్మా, టెక్​ మహీంద్రా, మారుతీ, బజాజ్ ఫినాన్స్, ఐసీఐసీఐ బ్యాంక్ ప్రధానంగా నష్టాల్లో ఉన్నాయి.

14:09 June 11

భారీ నష్టాల వైపు..

స్టాక్​ మార్కెట్లు భారీ నష్టాల దిశగా పయనిస్తున్నాయి. అమ్మకాల వెల్లువతో బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ- సెన్సెక్స్​ 471 పాయింట్ల నష్టంతో 33,775 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ- నిఫ్టీ  140 పాయింట్ల క్షీణతతో 9,976 వద్ద కొనసాగుతోంది. 

11:24 June 11

భారీ నష్టాల దిశగా..

స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల దిశగా పయనిస్తున్నాయి. సెన్సెక్స్ దాదాపు 390 పాయింట్ల నష్టంతో 33,860 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ దాదాపు 100 పాయింట్లు కోల్పోయి 10,014 వద్ద కొనసాగుతోంది.

అని రంగాల్లో వెల్లువెత్తుతున్న అమ్మకాలు నష్టాలకు ప్రధాన కారణం.

ఇండస్​ఇండ్ బ్యాంక్, హీరో మోటోకార్ప్, నెస్లే, బజాజ్ ఆటో, హెచ్​సీఎల్​టెక్, ఎం&ఎం, భారతీ  ఎయిర్​టెల్​ షేర్లు లాభాల్లో ఉన్నాయి.

సన్​ఫార్మా, టెక్ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంక్ , కోటక్ బ్యాంక్, ఇన్ఫోసిస్​, టీసీఎస్​ నష్టాల్లో ప్రధానంగా ఉన్నాయి.

09:35 June 11

ఒడుదొడుకుల్లో సూచీలు

లాభాల స్వీకరణతో స్టాక్ మార్కెట్లు గురువారం ఒడుదొడుకుల్లో కొనసాగుతున్నాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 140 పాయింట్లకు పైగా నష్టంతో.. ప్రస్తుతం 34,105 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 30 పాయింట్లకు పైగా క్షీణతతో 10,080 వద్ద కొనసాగుతోంది.

భారత ఆర్థిక వృద్ధి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆందోళనకరంగానే ఉండొచ్చని రేటింగ్ ఏజెన్సీల నివేదికలు అంచనా వేస్తున్న నేపథ్యంలో మదుపరుల సెంటిమెంట్ దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. వీటికి తోడు దేశవ్యాప్తంగా రోజు రోజుకు కరోనా కేసులు భారీ స్థాయిలో పెరుగుతుండటం కూడా నష్టాలకు కారణంగా నిపుణులు చెబుతున్నారు.  

ఫార్మా, ఐటీ, విద్యుత్ రంగాలు ప్రధానంగా నష్టాల్లో ఉన్నాయి.

లాభనష్టాల్లోనివివే..

ఇండస్ ఇండ్ బ్యాంక్, హీరో మోటోకార్ప్, యాక్సిస్ బ్యాంక్, ఎస్​బీఐ, బజాజ్​ ఆటో, నెస్లే షేర్లు లాభాల్లో ఉన్నాయి.

సన్​ఫార్మా, టైటాన్​, టీసీఎస్​, కోటక్ మహీంద్రా బ్యాంక్, టాటా స్టీల్, ఎన్​టీపీసీ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

Last Updated : Jun 11, 2020, 3:51 PM IST

ABOUT THE AUTHOR

...view details