ఆర్థిక, బ్యాంకింగ్ రంగాల నష్టాలు, విదేశీ పెట్టుబడుల ఉపసంహరణల ప్రభావంతో..ఇవాళ దేశీయ స్టాక్‌మార్కెట్లు ఒడుదొడుకులను ఎదుర్కొంటున్నాయి.
నవంబర్ టోకు ధరల ద్రవ్యోల్బణం, అక్టోబర్ నెల పారిశ్రామికోత్పత్తి గణాంకాలు ఈ వారం వెలువడనున్న దృష్ట్యా మదుపరులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. వొడాఫోన్-ఐడియాకు ఇచ్చిన రుణాలు నిరర్థక ఆస్తులుగా మారొచ్చన్న అంచనాలు కూడా మార్కెట్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తున్నాయి.
బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 15 పాయింట్లు లాభపడి 40 వేల 460 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 5 పాయింట్లు వృద్ధిచెంది 11 వేల 925 వద్ద ట్రేడవుతోంది.
లాభనష్టాల్లో
మారుతీ సుజుకి, జీ ఎంటర్టైన్మెంట్, వేదాంత, టాటా స్టీల్, హిందాల్కో, హెచ్డీఎఫ్సీ, టాటా మోటార్స్, సన్‌ఫార్మా రాణిస్తున్నాయి.
బజాజ్ ఫైనాన్స్, హెచ్‌యూఎల్, ఐటీసీ, టీసీఎస్, యాక్సిస్ బ్యాంకు, భారతీ ఇన్ఫ్రాటెల్, ఎస్ బ్యాంకు, ఎస్బీఐ, గెయిల్, సిప్లా, కోటక్ మహీంద్రా, టెక్ మహీంద్రా నష్టాల్లో ట్రేడవుతున్నాయి.