స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ నష్టాలతో ముగిశాయి. బీఎస్ఈ-సెన్సెక్స్ 661 పాయింట్లు కోల్పోయి 36,033 వద్దకు చేరింది. ఎన్ఎస్ఈ-నిఫ్టీ 195 పాయింట్ల నష్టంతో 10,607 వద్ద స్థిరపడింది.
ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లు భారీ నష్టాలను నమోదు చేయడం.. మదుపరుల సెంటిమెంట్‌ను దెబ్బతీసినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆర్థిక, వాహన రంగాల్లో భారీగా అమ్మకాలు నమోదవ్వడం కూడా నష్టాలకు కారణంగా తెలుస్తోంది.
ఇంట్రాడే సాగిందిలా..
సెన్సెక్స్ 36,538 పాయింట్ల అత్యధిక స్థాయి, 35,877 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.
నిఫ్టీ 10,755 పాయింట్ల గరిష్ఠ స్థాయి;10,562 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.