స్టాక్ మార్కెట్ల వరుస నష్టాలకు నేడు బ్రేక్ పడింది. కరోనా నేపథ్యంలో తలెత్తిన సంక్షోభాన్ని తట్టుకునేలా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆర్థిక వ్యవస్థను గాడినపెట్టేందుకు పలు ఉద్దీపనలు ప్రకటించారు. ఈ నేపథ్యంలో మదుపరుల సెంటిమెంట్ బలపడి కొనుగోళ్లపై దృష్టి సారించారు.
బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 693 పాయింట్లు బలపడి.. 26,674 వద్దకు చేరింది. ఇంట్రాడేలో ఈ సూచీ 27,463 పాయింట్ల గరిష్ఠాన్ని తాకగా.. 25,639 పాయింట్ల కనిష్ఠాన్ని నమోదు చేసింది.
జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 191 పాయింట్ల వృద్ధితో 7,801కి చేరింది. ఇంట్రాడేలో ఈ సూచీ 8,037 పాయింట్లు గరిష్ఠాన్ని, 7,511 పాయింట్ల కనిష్ఠాన్ని నమోదు చేసింది.