స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజూ నష్టాలతో ముగిశాయి. గురువారం సెషన్లో బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 27 పాయింట్లు కోల్పోయి.. 34,842 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 16 పాయింట్ల నష్టంతో 10,289 వద్దకు చేరింది.
మిడ్ సెషన్ ముందు కాస్త సానుకూలంగా స్పందించి.. లాభాలు నమోదు చేసిన సూచీలు వెంటనే నష్టాల్లోకి జారుకున్నాయి. చివరి గంటలో బ్యాంక్ షేర్లు పుంజుకోవడం వల్ల స్వల్ప నష్టాలతో సరిపెట్టుకున్నాయి.
దేశవ్యాప్తంగా కరోనా కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతుండటం కారణంగా మదుపరులు అమ్మకాలపై దృష్టి సారిస్తున్నారు. వీటికి తోడు విదేశీ మార్కెట్లు కూడా ప్రతికూలంగా స్పందించడం దేశీయ సూచీలపై ప్రభావం చూపినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.
ఇంట్రాడే సాగిందిలా..
సెన్సెక్స్ 35,082 పాయింట్ల అత్యధిక స్థాయి, 34,500 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.
నిఫ్టీ 10,362 పాయింట్ల గరిష్ఠ స్థాయి; 10,194 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.