తెలంగాణ

telangana

ETV Bharat / business

అమ్మకాల ఒత్తిడితో ఆరంభ లాభాలు ఆవిరి

లాభాల స్వీకరణతో స్టాక్ మార్కెట్లు నేడు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 262 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ 88 పాయింట్లు క్షీణించింది.

stocks closing
స్టాక్ మార్కెట్ల ముగింపు

By

Published : May 5, 2020, 3:51 PM IST

స్టాక్ మార్కెట్లు నేడూ నష్టాలతో ముగిశాయి. ఆరంభంలో భారీ లాభాలతో దూసుకెళ్లిన సూచీలు చివరిగంటలో నమోదైన అమ్మకాల ఒత్తిడితో నష్టాల్లోకి జారుకున్నాయి.

బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్​ 262 పాయింట్లు కోల్పోయి 31,453 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 88 పాయింట్ల నష్టంతో 9,206 వద్దకు చేరింది. ఆర్థిక రంగ షేర్లు ఎక్కువగా నష్టపోయాయి.

కారణాలు..

దేశవ్యాప్తంగా లాక్​డౌన్ పొడిగింపునకు తోడు, అంతర్జాతాయంగా కరోనా విజృంభణ పరిణామాలు మదుపరుల సెంటిమెంట్ దెబ్బతిన్నట్లు నిపుణులు చెబుతున్నారు.

ఇంట్రాడే సాగిందిలా..

సెన్సెక్స్ 32,264 పాయింట్ల అత్యధిక స్థాయి, 31,403 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.

నిఫ్టీ 9,451 పాయింట్ల గరిష్ఠ స్థాయి, 9,190 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.

లాభనష్టాల్లోనివి ఇవే..

ఎం&ఎం, పవర్​గ్రిడ్, ఓఎన్​జీసీ, రిలయన్స్, ఎన్​టీపీసీ, హెచ్​సీఎల్​టెక్, నెస్లే ఇండియా షేర్లు లాభపడ్డాయి.

ఎస్​బీఐ, బజాజ్ ఫినాన్స్, ఏషియన్ పెయింట్స్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ బ్యాంక్ షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.

రూపాయి..

కరెన్సీ మార్కెట్​లో రూపాయి నేడు 10 పైసలు బలపడింది. డాలర్​తో పోలిస్తే మారకం విలువ 75.63కి చేరింది.

ఇదీ చూడండి:'ప్రజలకు నేరుగా డబ్బులు ఇస్తేనే ఆర్థిక పునరుద్ధరణ'

ABOUT THE AUTHOR

...view details