తెలంగాణ

telangana

ETV Bharat / business

పన్నుల మోత భయంతో నష్టపోయిన మార్కెట్లు - share market

2020 బడ్జెట్​లో అల్పాదాయ వర్గాలపై పన్ను భారం పడే అవకాశాముందన్న వార్తల నేపథ్యంలో దేశీయ మార్కెట్లు నష్టపోయాయి. సెన్సెక్స్​ 208 పాయింట్లు కోల్పోయి 41 వేల 115 వద్ద ముగియగా, నిఫ్టీ 62 పాయింట్లు నష్టపోయి 12 వేల 106 వద్ద స్థిరపడింది.

stock market today
పన్నుల భయంతో.. నష్టపోయిన మార్కెట్లు

By

Published : Jan 22, 2020, 3:54 PM IST

Updated : Feb 18, 2020, 12:05 AM IST

లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్​మార్కెట్లు చివరికి నష్టాలతో ముగిశాయి. బడ్జెట్​లో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్​ రూ.7 లక్షల వరకు ఆదాయంపై 5 శాతం పన్ను ప్రతిపాదించవచ్చన్న వార్తలు మదుపరుల సెంటిమెంటును దెబ్బతీశాయి.

ఇంధన, విద్యుత్​, వాహన, ఫైనాన్షియల్ రంగాల వాటాలు​ అమ్మకాల ఒత్తిడికి లోనవ్వడం దీనికి మరింత ఆద్యం పోసింది. బడ్జెట్​కు ముందు ప్రధాన షేర్లు దిద్దుబాటుకు గురవడం సహజమేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ 208 పాయింట్లు కోల్పోయి 41 వేల 115 వద్ద ముగిసింది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 62 పాయింట్లు నష్టపోయి 12 వేల 106 వద్ద స్థిరపడింది.

లాభనష్టాల్లో

ఓఎన్​జీసీ, ఎన్​టీపీసీ, మారుతి, కోటక్​ బ్యాంకు, హెచ్​డీఎఫ్​సీ, ఏషియన్ పెయింట్స్, ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు నష్టపోయాయి.

నెస్లే ఇండియా, టీసీఎస్​, ఇన్ఫోసిస్​, హెచ్​సీఎల్​ టెక్, ఎస్​బీఐ, భారతీ ఎయిర్​టెల్​ రాణించాయి.

ఆసియా మార్కెట్లు

షాంఘై, హాంగ్​కాంగ్​, టోక్యో, సియోల్​ లాభాలతో ముగిశాయి. ఐరోపా మార్కెట్లు కూడా లాభాల్లో కొనసాగుతున్నాయి.

రూపాయి విలువ

రూపాయి విలువ ఒక డాలరుకు రూ.71.22గా ఉంది.

ముడిచమురు ధర

అంతర్జాతీయ మార్కెట్​లో ముడిచమురు ధరలు 0.67 శాతం తగ్గాయి. ప్రస్తుతం బ్యారెల్ ధర 64.16 డాలర్లుగా ఉంది.

ఇదీ చూడండి:ఫేస్​బుక్​ 'లిబ్రా' ప్రాజెక్ట్​ నుంచి వొడాఫోన్ ఔట్​

Last Updated : Feb 18, 2020, 12:05 AM IST

ABOUT THE AUTHOR

...view details