చివరి సెషన్లో భారీగా లాభపడిన స్టాక్ మార్కెట్లు.. మంగళవారం ఫ్లాట్‌గా ముగిశాయి. బీఎస్ఈ-సెన్సెక్స్ 8 పాయింట్లు తగ్గి.. 37,973 వద్ద ఫ్లాట్‌గా స్థిరపడింది. ఎన్ఎస్ఈ-నిఫ్టీ స్వల్పంగా 5 పాయింట్లు కోల్పోయి 11,222 వద్ద ఫ్లాట్‌గా సెషన్‌ను ముగించింది.
అంతర్జాతీయ సానుకూలతలతో పాటు.. ఆర్థిక పునరురద్ధరణకు ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకుంటుందన్న అంచనాలతో ఆరంభంలో లాభాలు గడించిన సూచీలు.. మిడ్ తర్వాత నుంచి మందకొడిగానే సాగాయి.
ఇంట్రాడే సాగిందిలా
సెన్సెక్స్ 38,236 పాయింట్ల అత్యధిక స్థాయి, 37,831 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.
నిఫ్టీ 11,305 పాయింట్ల గరిష్ఠ స్థాయి; 11,181 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.
లాభనష్టాల్లోనివి ఇవే..
అల్ట్రాటెక్ సిమెంట్, టీసీఎస్, టాటా స్టీల్, టైటాన్, హెచ్డీఎఫ్సీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు ప్రధానంగా లాభాల్లో ఉన్నాయి.