తెలంగాణ

telangana

ETV Bharat / business

వృద్ధి భయాలతో నష్టాల బాట... 12 వేల దిగువకు నిఫ్టీ - ఆర్థిక వృద్ధి రేటు అంచనాల్ని తగ్గిస్తూ నివేదిక

దేశ ఆర్థిక వృద్ధిపై ఆందోళనలతో మూడీస్​ ఇన్వెస్టర్​ సర్వీస్​... భారత క్రెడిట్​ రేటింగ్​ అవుట్​లుక్​ తగ్గించిన నేపథ్యంలో స్టాక్​మార్కెట్లు నష్టాల బాట పట్టాయి. మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడమూ నష్టాలకు ఒక కారణంగా విశ్లేషిస్తున్నారు. సెన్సెక్స్​ ఆరంభంలోనే 100 పాయింట్లకు పైగా కోల్పోయింది. నిఫ్టీ 30 పాయింట్లు కోల్పోయి 11 వేల 980 వద్ద కొనసాగుతోంది.

వృద్ధి భయాలతో నష్టాల బాట... 12 వేల దిగువన నిఫ్టీ

By

Published : Nov 8, 2019, 10:30 AM IST

స్టాక్​మార్కెట్లు మళ్లీ నష్టాల్లో పయనిస్తున్నాయి. నిన్నటి ట్రేడింగ్​లో జీవన కాల గరిష్ఠాన్ని నమోదు చేసిన సెన్సెక్స్​.. ఇవాళ మళ్లీ నష్టాల్లోకి జారుకుంది. భారత ఆర్థిక వృద్ధిపై ఆందోళన వ్యక్తం చేసిన.. మూడీస్​ ఇన్వెస్టర్స్​ సర్వీస్​ క్రెడిట్​ రేటింగ్​ అవుట్​లుక్​ను తగ్గిస్తూ నివేదిక విడుదల చేసింది. ఫలితంగా.. సూచీలు నెమ్మదించాయి. ప్రస్తుతం 113 పాయింట్లు కోల్పోయి.. 40 వేల 540 వద్ద కొనసాగుతోంది సెన్సెక్స్​.మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడమూ నష్టాలకు ఒక కారణంగా విశ్లేషిస్తున్నారు.

జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 12 వేల దిగువకు చేరింది. ప్రస్తుతం 30 పాయింట్ల నష్టంతో 11 వేల 980 వద్ద ట్రేడవుతోంది.

దేశీయ, అంతర్జాతీయ సానుకూలతల నడుమ స్టాక్​మార్కెట్లు నిన్నటి ట్రేడింగ్​లో మంచి లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్​ జీవన కాల గరిష్ఠాన్ని తాకి.. 40 వేల 654 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 12 వేల ఎగువకు చేరింది.

లాభనష్టాల్లోనివివే...

ఎస్​ బ్యాంక్​, ఐసీఐసీఐ బ్యాంక్​, ఇండస్​ ఇండ్​ బ్యాంక్​, ఎం అండ్​ ఎం, జీ ఎంటర్​టైన్​ మెంట్స్​ ఆరంభ ట్రేడింగ్​లో పుంజుకున్నాయి. దాదాపు 2 శాతం మేర రాణించాయి.

యూపీఎల్​, భారతీ ఇన్​ఫ్రాటెల్​, సన్​ ఫార్మా, హెచ్​యూఎల్​, గెయిల్​ డీలాపడ్డాయి.

రూపాయి..

ఆరంభ ట్రేడింగ్​లో రూపాయి భారీగా పతనమైంది. 30 పైసలు క్షీణించి.. ప్రస్తుతం డాలర్​తో పోలిస్తే మారకం విలువ 71.27 వద్ద ఉంది.

ABOUT THE AUTHOR

...view details