తెలంగాణ

telangana

ETV Bharat / business

ఆర్థిక మాంద్యం భయాలు.. నష్టాల్లోనే మార్కెట్లు

stock-markets-live-updates-3rd-april-2020
అవే భయాలు- సెన్సెక్స్ 400 పాయింట్లు పతనం

By

Published : Apr 3, 2020, 9:26 AM IST

Updated : Apr 3, 2020, 10:01 AM IST

09:58 April 03

బ్యాంకింగ్​, ఆటో రంగాల్లో నష్టాలతో స్టాక్​మార్కెట్లు ఇవాళ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్​ ఆరంభంలో 400కుపైగా పాయింట్లు కోల్పోయింది. కొవిడ్​-19 మహమ్మారి ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పెనుప్రభావం చూపనుందన్న అనిశ్చితి నేపథ్యంలో మదుపరుల మనోభావాలు దెబ్బతిన్నాయి. భయాలు వెంటాడుతున్నాయి.  

ప్రస్తుతం 225 పాయింట్ల నష్టంతో సెన్సెక్స్​ 28 వేల 40 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 75 పాయింట్లు కోల్పోయి 8 వేల178 వద్ద కొనసాగుతోంది.

ముఖ్యంగా బ్యాంకింగ్​ రంగం భారీ నష్టాలను మూటగట్టుకుంది. సెన్సెక్స్​ ప్యాక్​లో కోటక్​ బ్యాంకు 7 శాతానికి పైగా నష్టపోయింది. ఇండస్​ఇండ్​ బ్యాంక్​, హీరోమోటోకార్ప్​, ఏషియన్​ పెయింట్స్​, టైటాన్​, ఐసీఐసీఐ బ్యాంకు నష్టాలోనే ఉన్నాయి.  

సిప్లా, బజాజ్​ ఫినాన్స్​, గెయిల్​, ఓఎన్​జీసీ, సన్​ ఫార్మా రంగాలు రాణిస్తున్నాయి.  

బీపీసీఎల్​, హీరో మోటోకార్ప్​, టైటాన్​ కంపెనీ డీలాపడ్డాయి.  

రూపాయి..

ఆరంభ ట్రేడింగ్​లో రూపాయి భారీగా క్షీణించింది. 48 పైసలు కోల్పోయి... ప్రస్తుతం 76.08 వద్ద ఉంది.  

09:39 April 03

రూపాయి పతనం..

ఆరంభ ట్రేడింగ్​లో రూపాయి 48 పైసలు కోల్పోయింది. డాలర్​తో పోలిస్తే మారకం విలువ ప్రస్తుతం 76.08 వద్ద ఉంది. 

09:23 April 03

వెంటాడుతున్న భయాలు- సెన్సెక్స్ 400 పాయింట్లు పతనం

కరోనా సంక్షోభంతో ఆర్థిక మాంద్యం తప్పదన్న భయాలు మదుపర్లను వెంటాడుతున్నాయి. ఫలితంగా స్టాక్​ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 400 పాయింట్లు పతనమై 27 వేల 860 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 110 పాయింట్లు తగ్గి 8 వేల 140 వద్ద కొనసాగుతోంది. 

Last Updated : Apr 3, 2020, 10:01 AM IST

ABOUT THE AUTHOR

...view details