తెలంగాణ

telangana

ETV Bharat / business

కరోనా 2.0పై భయాలు- ​మార్కెట్లకు నష్టాలు - Sensex drops 190 pts

కరోనా భయాలు పెట్టుబడిదారుల సెంటిమెంట్​ను దెబ్బతీయడం వల్ల ఇవాళ దేశీయ మార్కెట్లు నష్టాలపాలయ్యాయి. తీవ్ర ఒడుదొడుకుల మధ్య సాగిన ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 190 పాయింట్లు క్షీణించింది. నిఫ్టీ 42 పాయింట్ల మేర నష్టపోయింది.

stock market closes red
స్వల్ప నష్టాలతో గట్టెక్కిన స్టాక్​మార్కెట్లు

By

Published : May 12, 2020, 4:45 PM IST

కరోనా వైరస్‌ రెండో విడత మరింత విజృంభిస్తుందనే భయాల మధ్య మదుపరులు ఆచితూచి స్పందించారు. ఫలితంగా దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి.

బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 190 పాయింట్లు కోల్పోయి 31 వేల 371 వద్ద ముగిసింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 42 పాయింట్లు నష్టపోయి 9 వేల 196 వద్ద స్థిరపడింది.

లాభనష్టాల్లో

ఎన్​టీపీసీ, భారతీ ఎయిర్​టెల్​, ఐటీసీ, బజాజ్​ ఆటో, పవర్​గ్రిడ్, ఇండస్​ఇండ్ బ్యాంకు, టైటాన్ రాణించాయి.

రిలయన్స్ ఇండస్ట్రీస్ భారీగా నష్టపోయింది. ఏసియన్ పెయింట్స్, కోటక్ బ్యాంకు, ఓఎన్​జీసీ, నెస్లే ఇండియా, టాటా స్టీల్, హెచ్​డీఎఫ్​సీ బ్యాంకు​ నష్టాలు చవిచూశాయి.

ఆసియా మార్కెట్లు

చైనాలోని వుహాన్​లో కొత్తగా ఆరు పాజిటివ్ కేసులు నమోదు కావడం, దక్షిణ కొరియా మరోసారి కొవిడ్​-19 విజృంభించిన నేపథ్యంలో ఆసియా మార్కెట్లు డీలాపడ్డాయి. ఫలితంగా షాంఘై, హాంగ్​కాంగ్​, టోక్యో, సియోల్​ స్టాక్​మార్కెట్లు నష్టాలపాలయ్యాయి.

ఐరోపా మార్కెట్లు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి.

ముడిచమురు

అంతర్జాతీయ మార్కెట్​లో ముడిచమురు ధర 1.69 శాతం పెరిగింది. ప్రస్తుతం బ్యారెల్ ధర 30.31 డాలర్లుగా ఉంది.

రూపాయి

రూపాయి విలువ 22 పైసలు పెరిగి, డాలరుకు రూ.75.51గా ఉంది.

ఇదీ చూడండి:'చైనా చేజారినా భారత్​కు దక్కడం డౌటే!'

ABOUT THE AUTHOR

...view details