తెలంగాణ

telangana

ETV Bharat / business

ట్రంప్​కు కష్టం - దేశీయ స్టాక్​మార్కెట్లకు నష్టం - ట్రంప్​పై అభిశంసన తీర్మానం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​పై అమెరికా సభలో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టడం దేశీయ మార్కెట్లను దెబ్బతీసింది. సెన్సెక్స్ 167 పాయింట్లు, నిఫ్టీ 58 పాయింట్ల నష్టపోయాయి. లోహ, వాహన రంగాలు లాభపడగా... ఐటీ, ఫార్మా రంగాలు నష్టాలపాలయ్యాయి.

ట్రంప్​కు కష్టం - దేశీయ స్టాక్​మార్కెట్లకు నష్టం

By

Published : Sep 27, 2019, 4:20 PM IST

Updated : Oct 2, 2019, 5:36 AM IST

అంతర్జాతీయ ప్రతికూలతల నేపథ్యంలో ఇవాళ స్టాక్​మార్కెట్లు నష్టాలపాలయ్యాయి. ముఖ్యంగా ఐటీ, ఫార్మా రంగాలు నష్టాలు చవిచూశాయి. లోహ రంగాల షేర్లు లాభపడ్డాయి. ప్రారంభంలో నష్టాలు చవిచూసిన వాహనరంగం చివరకు 10 శాతం మేర పుంజుకుంది.

బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 167 పాయింట్లు కోల్పోయి 38 వేల 822 వద్ద ముగిసింది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 58 పాయింట్లు నష్టపోయి 11 వేల 512 వద్ద స్థిరపడింది.

అమెరికా-చైనా వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశముందన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్​ ప్రకటనతో నిన్న దేశీయ స్టాక్​మార్కెట్లు లాభాలను మూటగట్టుకున్నాయి. అయితే అమెరికా సభలో ఆయనపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టడం మదుపర్ల సెంటిమెంట్​ను దెబ్బతీసింది.

లాభల్లో

భారతీ ఎయిర్​టెల్, బజాజ్ ఫైనాన్స్​, కోటక్​ బ్యాంకు, ఎన్​టీపీసీ, కోటక్​ మహీంద్రా, ఐటీసీ, బజాజ్​ ఫెన్సివ్​, రిలయన్స్​ 1.61 శాతం మేర రాణించాయి.

నష్టాల్లో

వేదాంత, జీ ఎంటర్​టైన్​మెంట్​, ఎస్ బ్యాంకు, ఇండస్​ఇండ్​ బ్యాంకు, టాటా స్టీల్​, ఓఎన్​జీసీ, టాటా మోటార్స్​, సన్​ఫార్మా, ఎమ్​ అండ్​ ఎమ్​, టీసీఎస్​, హీరో మోటోకార్ప్​ 5.39 శాతం మేర నష్టపోయాయి.

ఆసియా మార్కెట్లు

హాంగ్​సెంగ్​, నిక్కీ, కోస్పీ నష్టాలపాలవ్వగా, షాంఘై కాంపోజిట్ సూచీ​ లాభాలతో ముగిసింది. ఐరోపా​ మార్కెట్లు మాత్రం లాభాల్లో కొనసాగుతున్నాయి.

రూపాయి విలువ

రూపాయి విలువ 20 పైసలు పెరిగి, ఒక డాలరుకు రూ.70.67 గా (ఇన్​ట్రా డే) ఉంది.

ముడిచమురు

అంతర్జాతీయ మార్కెట్​లో ముడిచమురు ధర 0.33 శాతం పడిపోయింది. ప్రస్తుతం బ్యారల్​ ధర 62.55 డాలర్లుగా ఉంది.

ఇదీ చూడండి:లైక్​లు దాయడంపై ఆస్ట్రేలియాలో ఫేస్​బుక్​ ప్రయోగం

Last Updated : Oct 2, 2019, 5:36 AM IST

ABOUT THE AUTHOR

...view details