తెలంగాణ

telangana

ETV Bharat / business

నష్టాల్లో ముగిసిన మార్కెట్లు- సెన్సెక్స్ 300 మైనస్ - సెన్సెక్స్

stocks today
నేటి స్టాక్ మార్కెట్లు

By

Published : Sep 22, 2020, 9:36 AM IST

Updated : Sep 22, 2020, 3:55 PM IST

15:50 September 22

నష్టాల్లోనూ ఐటీ జోరు..

అమ్మకాల ఒత్తిడితో స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాలతో ముగిశాయి. సెెన్సెక్స్​ 300 పాయింట్లు తగ్గి 37,734 వద్దకు చేరింది. నిఫ్టీ 97 పాయింట్లు నష్టపోయి 11,154 వద్ద స్ధిరపడింది. 

ఐటీ మినహా దాదాపు మిగతా అన్ని రంగాలు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి.

ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లన్నీ మంగళవారం నష్టాలను నమోదు చేశాయి.

  • హెచ్​సీఎల్​టెక్, టీసీఎస్​, సన్​ఫార్మా, టెక్ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు  లాభా పడ్డాయి.
  • మారుతీ సుజుకీ, ఇండస్​ఇండ్​ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎల్&టీ, ఓఎన్​జీసీ, ఏషియన్ పెయింట్స్ షేర్లు నష్టాల్లో ప్రధానంగా ఉన్నాయి.

09:51 September 22

ఆగని నష్టాలు..

స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 410 పాయింట్లకుపైగా కోల్పోయి 37,617 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 160 పాయింట్లకుపైగా నష్టంతో 11,090 వద్ద కొనసాగుతోంది.

ఐరోపాలో కరోనా కేసుల భయాలు, దేశీయంగా ఆర్థిక వృద్ధిపై నెలకొన్న అనిశ్చితి, సెప్టెంబర్ డెరివేటివ్ కాంట్రాక్టుల గడువు ముగింపు దగ్గరపడుతున్న నేపథ్యంలో ముదుపరులు అమ్మకాలపై దృష్టి సారిస్తున్నారు. ఫలితంగా సూచీలు ఈ స్థాయిలో నష్టాలను నమోదు చేస్తున్నట్లు తెలుస్తోంది.

  • 30 షేర్ల ఇండెక్స్​లో హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్, టీసీఎస్​, ఐసీఐసీఐ బ్యాంక్ మాత్రమే లాభాల్లో ఉన్నాయి.
  • టాటా స్టీల్, ఎం&ఎం, బజాజ్ ఫినాన్స్, ఓఎన్​జీసీ, ఎన్​టీపీసీ, బజాజ్ ఫినన్​సర్వ్ షేర్లు నష్టాల్లో ప్రధానంగా ఉన్నాయి.

09:21 September 22

స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్​ 108 పాయింట్లు కోల్పోయి 37,925కి పడిపోయింది. నిఫ్టీ 43 పాయింట్ల క్షీణించి 11,206 వద్ద ట్రేడ్ అవుతోంది.

Last Updated : Sep 22, 2020, 3:55 PM IST

ABOUT THE AUTHOR

...view details