స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. చైనా తర్వాత పలు ఇతర దేశాలకు కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుండటం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. ఆ ప్రభావంతో ఐదు నెలల కనిష్ఠానికి పడిపోయాయి దేశీయ సూచీలు.
బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ- సెన్సెక్స్ 1,089 పాయింట్లకు పైగా నష్టపోయింది. ప్రస్తుతం 38,655 వద్దకు చేరింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ- నిఫ్టీ 328 పాయింట్లకు పైగా క్షీణతతో 11,304 వద్ద కొనసాగుతోంది.
రూ.5 లక్షల కోట్లు ఆవిరి..
బీఎస్ఈ మదుపరుల సంపద రూ.4,65,915.58 కోట్లు ఆవిరైంది. ఫలింతంగా మదుపరుల మొత్తం సంపద రూ.1,47,74,108.50 కోట్లకు తగ్గింది.
లాభనష్టాల్లోనివివే..
30 షేర్ల ఇండెక్స్‌లో ఎన్టీపీసీ మినహా మిగతా అన్ని కంపెనీలు నష్టాల్లో ఉన్నాయి.