2019 చివరి సెషన్లో స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. ప్రారంభం నుంచే ఒడుదొడుకుల్లో కొనసాగిన సూచీలు ఏ దశలోనూ కోలుకోలేకపోయాయి. దాదాపు అన్ని రంగాలు నేడు నష్టాలను చవి చూడగా.. ఐటీ, వాహన, ప్రైవేట్ బ్యాంకింగ్ షేర్లపై అమ్మకాల ఒత్తిడి ఎక్కువగా కనిపించింది.
బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 304 పాయింట్లు క్షీణించింది. చివరకు 41,254 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 87 పాయింట్ల నష్టంతో 12,168 వద్దకు చేరింది.
ఇంట్రాడే సాగిందిలా..
సెన్సెక్స్ 41,607 (నేటి సెషన్ ప్రారంభమైన స్థాయి) పాయింట్ల గరిష్ఠాన్ని తాకగా.. 41,185 పాయింట్ల కనిష్ఠాన్ని నమోదు చేసింది.
నిఫ్టీ నేడు 12,247 పాయింట్ల అత్యధిక స్థాయి.. 12,151 పాయింట్ల అత్యల్ప స్థాయిల మధ్య కదలాడింది.
లాభనష్టాల్లోనివి ఇవే..