టెలికాం నియంత్రణ ప్రాధికార సంస్థ(ట్రాయ్) నూతన ఛైర్మన్‌గా సీనియర్ అధికారి పీడీ వాఘేలా నియామకమయ్యారు. ప్రస్తుతం ఛైర్మన్ ఆర్ఎస్ శర్మ పదవీ కాలం ఈనెల 30తో ముగియనున్న నేపథ్యంలో ఈ మేరకు నూతన ఛైర్మన్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది కేంద్రం.
మూడేళ్ల కాలం లేదా 65 ఏళ్ల వయసు వరకు(ఏదీ ముందు వస్తే అది) ట్రాయ్ ఛైర్మన్‌గా కొనసాగనున్నారు వాఘేలా.
వాఘేలా.. 1986 బ్యాచ్ గుజరాత్ కేడర్ ఐఏఎస్ అధికారి. ప్రస్తుతం ఫార్మాస్యూటికల్ విభాగం కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్నారు.
ప్రస్తుత ఛైర్మన్ ఆర్ఎస్ శర్మ స్థానాన్ని భర్తీ చేయనున్నారు వాఘేలా. 2015లో ట్రాయ్ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు శర్మ. అనంతరం 2018, ఆగస్టులో ఆయన పదవిని 2020, సెప్టెంబర్ 30 వరకు పొడిగించింది కేంద్రం.
ఇదీ చూడండి: 'ఒకే దేశంపై ఆధారపడటం చాలా ప్రమాదం'