ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ తన మొబైల్ యాప్ భద్రతా లోపాన్ని సరిచేసినట్లు ప్రకటించింది. ఫలితంగా సున్నితమైన వినియోగదారుల సమాచారం (డేటా) లీక్ అయ్యే ముప్పు తప్పింది.
బెంగళూరుకు చెందిన స్వతంత్ర సైబర్ పరిశోధకుడు ఇరాజ్ అహ్మద్ ఎయిర్‌టెల్ యాప్‌లోని భద్రతాలోపాన్ని గుర్తించాడు. ఇది చందాదారుల సున్నితమైన సమాచారాన్ని ఎవరైనా పొందడానికి అనుమతిస్తున్నట్లు తన బ్లాగ్‌లో పేర్కొన్నాడు.
"ఎయిర్‌టెల్ యాప్‌లోని భద్రతాలోపం వల్ల .. వినియోగదారుల పేర్లు, లింగం, ఈ-మెయిల్, పుట్టిన తేదీ, చిరునామా, చందా వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే వినియోగదారుల పరికరాల (సెల్‌ఫోన్) 4జీ, 3జీ, జీపీఆర్ఎస్ సామర్థ్యం, నెట్వర్క్ సమాచారం, మొబైల్ ఐఎమ్ఈఐ నెంబర్ తదితర వివరాలు సులభంగా పొందవచ్చు. ఫలితంగా దేశంలోని 32.55 కోట్ల మంది వినియోగదారుల సమాచారం లీక్ అయ్యే ప్రమాదం ఉంది. " - అహ్మద్, సైబర్ పరిశోధకుడు