గృహ యజమానులకు ఆర్థిక రుణదాతల హోదాను ఇస్తూ... దివాలా స్మృతి(ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్ట్సీ కోడ్-ఐబీసీ)కి చేసిన సవరణలను సుప్రీంకోర్టు సమర్థించింది.
జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం... పలువురు బిల్డర్లు దాఖలు చేసిన 180కిపైగా పిటిషన్లను కొట్టివేసింది. రెరా ప్రకారం గృహకొనుగోలుదారుల సమస్యలకు పరిష్కారాలు అందుబాటులో ఉన్నాయని, ఐబీసీకి చేసిన సవరణలు నకీలీలకు అవకాశాలను కల్పిస్తాయన్న వాదనలను తోసిపుచ్చింది. స్థిరాస్తి రంగాన్ని నియంత్రించే రెరా చట్టాన్ని, ఐబీసీ సవరణలతో సహా శ్రద్ధగా చదవాలని సూచించింది. వివాదమే వస్తే ఐబీసీ ప్రకారమే నడుచుకోవాల్సి ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది.