తెలంగాణ

telangana

ETV Bharat / business

'మారటోరియంలో వడ్డీ'పై నేడు సుప్రీం విచారణ

మారటోరియం కాలంలో రుణాలపై చక్రవడ్డీ అంశంలో నేడు విచారణ చేపట్టనుంది సుప్రీం కోర్టు. కేంద్రం, రిజర్వు బ్యాంకు సమర్పించిన అఫిడవిట్ల ఆధారంగా తదుపరి నిర్ణయం తీసుకునే అవకాశముంది.

SC to hear on Wednesday batch of pleas on loan moratorium
ఆర్​బీఐ అఫిడవిట్​పై సుప్రీంకోర్టు విచారణ

By

Published : Oct 14, 2020, 5:25 AM IST

మారటోరియం సమయంలో రుణాల చక్రవడ్డీ మాఫీ అంశాన్ని బుధవారం విచారించనుంది సుప్రీం కోర్టు. ఇప్పటికే కేంద్రం, రిజర్వు బ్యాంకు దాఖలు చేసిన అఫిడవిట్​లను పరిశీలించనుంది.

కరోనా కట్టడికి విధించిన లాక్​డౌన్​లో వివిధ రుణాలపై ఆర్​బీఐ మారటోరియం అమలు చేసింది. ఆ వ్యవధిలో రుణాలపై వడ్డీ వసూలు చేయటం, ఆ వడ్డీపై వడ్డీ విధించటం వల్ల లాభమేమీ ఉండదని పలువురు సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

'అలా చేస్తే కష్టమే'

రుణాలపై మారటోరియం గడువును మరింతకాలం పొడిగించలేమని సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్​లో ఆర్​బీఐ పేర్కొంది. మారటోరియం కాలాన్ని పెంచితే అది వాయిదాల చెల్లింపులపై ప్రతికూల ప్రభావం పడుతుందని, ఆర్థిక క్రమశిక్షణ తప్పుతుందని ఆందోళన వ్యక్తంచేసింది.

కేంద్రం సైతం దాదాపు ఇదే తరహా వాదన వినిపించింది. అయితే రూ.2కోట్లు వరకు రుణాలపై చక్రవడ్డీ మాఫీకి నిర్ణయం తీసుకుంది. ఇదే విషయాన్ని అఫిడవిట్ ద్వారా సుప్రీంకోర్టుకు తెలియచేసింది.

మారటోరియానికి సంబంధించిన వ్యాజ్యాలపై మంగళవారమే విచారణ జరగాల్సి ఉంది. అయితే బుధవారం వాదనలు వింటామని జస్టిస్​ అకోశ్​ భూషణ్, జస్టిస్ ఆర్​ఎస్​ రెడ్డి, జస్టిస్ ఎంఆర్​ షాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం స్పష్టంచేసింది.

ఇదీ చూడండి:'చక్రవడ్డీ మాఫీకి ఓకే.. మారటోరియం పొడిగింపే కష్టం'

ABOUT THE AUTHOR

...view details