తెలంగాణ

telangana

ETV Bharat / business

FRL-Reliance deal: అమెజాన్‌ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్‌

ఫ్యూచర్‌ సంస్థ రిలయన్స్‌ రిటైల్‌తో చేసుకున్న విలీన ఒప్పందంపై (FRL-Reliance deal) అమెజాన్​ దాఖలు చేసిన పిటీషన్​పై సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్​లో పెట్టింది. ఫ్యూచర్‌ సంస్థ రిలయన్స్‌ రిటైల్‌తో చేసుకున్న ఒప్పందాన్ని నిలిపివేస్తూ సింగపూర్‌కు చెందిన ఎమర్జెన్సీ ఆర్బిటరేటర్‌ ఇచ్చిన తీర్పును అమలు చేయాలని అమెజాన్‌ తన పిటిషన్‌లో పేర్కొంది.

future retail reliance, ఫ్యూచర్​ రిటైల్​ రిలయన్స్​
FRL-Reliance deal: అమెజాన్‌ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్‌

By

Published : Jul 30, 2021, 5:12 AM IST

రిలయన్స్‌ రిటైల్‌తో ఫ్యూచర్‌ రిటైల్‌ చేసుకున్న రూ.24,713 కోట్ల విలీన ఒప్పందాన్ని (FRL-Reliance deal) సవాల్‌ చేస్తూ ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థ అమెజాన్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్‌లో పెట్టింది. ఫ్యూచర్‌-రిలయన్స్‌ ఒప్పందంపై ముందుకు వెళ్లొచ్చని ఇటీవల దిల్లీ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. అయితే ఈ తీర్పును సవాల్‌ చేస్తూ అమెజాన్‌ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ఫ్యూచర్‌ సంస్థ రిలయన్స్‌ రిటైల్‌తో చేసుకున్న ఒప్పందాన్ని నిలిపివేస్తూ సింగపూర్‌కు చెందిన ఎమర్జెన్సీ ఆర్బిటరేటర్‌ ఇచ్చిన తీర్పును అమలు చేయాలని అమెజాన్‌ తన పిటిషన్‌లో పేర్కొంది. దీనిపై ఇరుపక్షాల వాదనలు విన్న జస్టిస్‌ ఆర్‌.ఎఫ్‌ నారిమన్‌ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పును రిజర్వ్‌లో పెట్టింది.

ఫ్యూచర్‌ గ్రూప్‌నకు చెందిన రిటైల్‌, హోల్‌సేల్‌, లాజిస్టిక్స్‌, వేర్‌హౌసింగ్‌ వ్యాపారాలను కొనుగోలు చేసేందుకు రిలయన్స్‌ గతేడాది ఒప్పందం కుదుర్చుకుంది. దీని విలువ రూ.24,713 కోట్లు. అయితే ఫ్యూచర్‌ గ్రూప్‌కు చెందిన ఫ్యూచర్‌ కూపన్స్‌ లిమిటెడ్‌లో అమెజాన్‌ 2019లో 49 శాతం మేర పెట్టుబడులు పెట్టింది. ఫ్యూచర్‌ కూపన్స్‌కు 7.3 శాతం మేర ఫ్యూచర్‌ రిటైల్‌లో వాటా ఉంది. దీంతో మూడేళ్ల నుంచి 10 ఏళ్లలోపు ఫ్యూచర్‌ రిటైల్‌ను కొనుగోలు చేసే హక్కు అమెజాన్‌కు దఖలు పడింది. అయితే, రిలయన్స్‌-ఫ్యూచర్‌ మధ్య కుదిరిన ఒప్పందం ఈ నిబంధనను ఉల్లంఘిస్తోందని అమెజాన్‌ వాదిస్తోంది. ఈ క్రమంలోనే అమెజాన్‌ సింగపూర్‌ మధ్యవర్తిత్వ కోర్టును ఆశ్రయించగా.. రిలయన్స్‌తో డీల్‌పై స్టే విధించింది. అటు దిల్లీ హైకోర్టులోని ఏకసభ్య ధర్మాసనం కూడా అమెజాన్‌కు అనుకూలంగా తీర్పు వెలువరించింది.

అయితే ఏక సభ్య ధర్మాసనం తీర్పును సవాలు చేస్తూ ఫ్యూచర్‌ గ్రూప్‌ దిల్లీ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ను ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. ఫ్యూచర్‌ - రిలయన్స్‌ ఒప్పందంపై ముందుకెళ్లొచ్చని స్పష్టం చేసింది.

ఇదీ చదవండి :'జులైలో 6శాతం దిగువకు ద్రవ్యోల్బణం'

ABOUT THE AUTHOR

...view details