తెలంగాణ

telangana

ETV Bharat / business

టెలికాం డైరెక్టరేట్​పై సుప్రీం అసంతృప్తి - సవరించిన స్థూల ఆదాయం (ఏజీఆర్)

టెలికాం కంపెనీల సవరించిన స్థూల ఆదాయం బకాయిల విషయంలో టెలికాం శాఖ డైరెక్టరేట్​పై అత్యున్యత న్యాయస్థానం మరోసారి అసంతృప్తి వ్యక్తం చేసింది. బకాయిలను స్వీయ మదింపు చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని డైరెక్టరేట్​ అడగటం అనుమతించదగినది కాదని తెలిపింది.

SC questions DoT demand for AGR dues from PSUs, says it is totally impermissible
ఆ విషయంలో టెలికాం డైరెక్టరేట్​పై సుప్రీం అసంతృప్తి

By

Published : Jun 11, 2020, 4:52 PM IST

టెలికాం కంపెనీల సవరించిన స్థూల ఆదాయం (ఏజీఆర్) బకాయిల వసూళ్ల వ్యవహారంలో.....టెలికాం శాఖ డైరెక్టరేట్‌పై సుప్రీంకోర్టు మరోసారి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఏజీఆర్​ బకాయిలను స్వీయ మదింపు చేసుకునేందుకు టెలికాం కంపెనీలకు అవకాశం ఇవ్వాలని టెలికాం శాఖ డైరెక్టరేట్‌ కోరడం ఎంత మాత్రం అనుమతించదగినది కాదని స్పష్టం చేసింది.

టెలికాం శాఖ డైరెక్టరేట్‌ పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం అనేక ప్రశ్నలను లేవనెత్తింది. స్వీయ మదింపునకు గతంలో తాము అనుమతి నిరాకరిస్తూ ఇచ్చిన తీర్పును కేంద్ర ప్రభుత్వం తప్పుగా అర్ధం చేసుకుందని ధర్మాసనం అభిప్రాయపడింది. టెలికాం శాఖ డైరెక్టరేట్‌ తరఫున వాదనలు వినిపించిన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా...ఏజీఆర్​ బకాయిల అంశంపై ప్రమాణ పత్రం దాఖలు చేస్తానని తెలిపారు.

ఏజీఆర్​ బకాయిలను స్వీయ మదింపు చేసుకునేందుకు ఇచ్చిన అనుమతిని తిరస్కరిస్తూ 2019 అక్టోబర్‌లో తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు టెలికాం శాఖ డైరెక్టరేట్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీన్ని పునఃసమీక్షించాలని ప్రైవేటు టెలికాం కంపెనీలు సుప్రీంను ఆశ్రయించగా...వడ్డీతో సహా బకాయిలను చెల్లించాల్సిందే అని గత నెలలో స్పష్టం చేసింది.

ఇదీ చూడండి:పొట్టకూటి కోసం బుట్టలు అల్లుతున్న లాయర్​!

ABOUT THE AUTHOR

...view details