తెలంగాణ

telangana

ETV Bharat / business

మారటోరియంలోనూ వడ్డీపై కేంద్రం, ఆర్బీఐకి సుప్రీం నోటీసులు - moratorium news

కరోనా కారణంగా రుణాల చెల్లింపుపై విధించిన మారటోరియం సమయంలోనూ వడ్డీ వసూలు చేయటంపై స్పందించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐకి నోటీసులు ఇచ్చింది సుప్రీంకోర్టు. వారంలోపు కౌంటర్​ దాఖలు చేయాలని ఆదేశించింది.

SC issues notice to Centre
మారటోరియంలోనూ వడ్డీపై కేంద్రం, ఆర్బీఐకి సుప్రీం నోటీసులు

By

Published : May 26, 2020, 8:20 PM IST

మారటోరియం సమయంలో రుణాలపై వడ్డీ వసూలు చేయటాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యంపై స్పందించాలని కేంద్ర ప్రభుత్వం, భారతీయ రిజర్వ్​ బ్యాంక్(ఆర్​బీఐ)కు నోటీసులు జారీ చేసింది సుప్రీం కోర్టు.

జస్టిస్​ అశోక్​​ భూషణ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా ఈ వ్యాజ్యంపై విచారణ చేపట్టింది. వారంలోపు తమ స్పందనలు తెలపాలని కేంద్రం, ఆర్​బీఐకి నోటీసులు ఇచ్చింది.

ఈ సందర్భంగా.. ఆర్బీఐ అందించిన ప్రయోజనాలు రుణ గ్రహీతలకు అందుతున్నట్లు కనిపించటం లేదని కేంద్ర తరఫున హాజరైన సొలిసిటర్​ జనరల్​ తుషార్​ మెహతకు తెలిపింది ధర్మాసనం. అనంతరం పలు సూచనలు చేసింది. కౌంటర్​ అఫిడవిట్​ దాఖలు చేసేందుకు వారం రోజుల సమయం కావాలని ఆర్​బీఐ తరఫు న్యాయవాది కోరిన క్రమంలో అనుమతించినట్లు ఆదేశాల్లో పేర్కొంది.

మారటోరియంలో రుణాలపై వడ్డీ కొనసాగించటాన్ని సవాల్​ చేస్తూ ఆగ్రాకు చెందిన గజేంద్ర శర్మ పిటిషన్​ దాఖలు చేశారు. మార్చి 27న విడుదల చేసిన ఆర్బీఐ ప్రకటనలో మారటోరియం సమయంలో వడ్డీ కొనసాగింపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా చూడాలని కోరారు. వడ్డీ లేకుండా రుణాలు చెల్లించేందుకు ఉపశమనం కల్పించేందుకు కేంద్రం, ఆర్బీఐకి ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్​లో పేర్కొన్నారు.

మారటోరియం విధించిన క్రమంలో ఈ విధంగా రుణగ్రహీతలకు జరిమానా విధించొద్దని, బ్యాంకులు వడ్డీని వసూలు చేయకుండా చూడాలని కోరారు పిటిషనర్​ తరఫు న్యాయవాది.

ఇరు వర్గాల వాదనలు విన్న ధర్మాసనం.. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.

కరోనా వైరస్​ కారణంగా మార్చి 1నాటికి చెల్లించాల్సిన అన్ని రుణాలపై 3 నెలల మారటోరియం విధిస్తూ మార్చి 27 ఆదేశాలు జారీ చేసింది ఆర్బీఐ. అయితే వడ్డీ కొనసాగుతుందని పేర్కొంది. లాక్​డౌన్​ పోడిగించిన నేపథ్యంలో మారటోరియం మారోమారు ఆగస్టు 31 వరకు పెంచింది.

ABOUT THE AUTHOR

...view details