మారటోరియం కాలంలో వడ్డీ చెల్లింపులపై కేంద్ర ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు. కొవిడ్ దృష్ట్యా రూ.2 కోట్లు చెల్లించిన ఎనిమిది కేటగిరీల రుణాలపై వడ్డీని రద్దు చేయాలనే నిర్ణయాన్ని అమలు చేయడానికి కేంద్రం అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
కరోనా... ప్రజల ఆరోగ్యంపైనే కాకుండా ప్రభుత్వ, ప్రైవేటు రంగాల వాణిజ్యంపైనా ప్రభావం చూపిందని, ఫలితంగా ఆర్థికంగా నష్టం వాటిల్లిందని న్యాయస్థానం పేర్కొంది. మహమ్మారి వ్లల విధించిన లాక్డౌన్ను దశల వారీగా ఎత్తివేస్తున్నప్పటికీ చాలా పరిశ్రమలు పూర్తిస్థాయి కార్యకలాపాలకు నోచుకోలేదని తెలిపింది. ఈ నేపథ్యంలో రుణాలపై వడ్డీని మాఫీ చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఎంఎస్ఎంఈలు, విద్య, గృహ, వినియోగ వస్తువులు(కన్జూమర్ డూరబుల్స్), క్రెడిట్ కార్డు, ఆటోమొబైల్స్, వ్యక్తిగత, వినియోగ వంటి ఎనిమిది రకాల రుణాలపై వడ్డీని మాఫీ చేయడానికి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించింది.