తెలంగాణ

telangana

ETV Bharat / business

క్రిప్టో కరెన్సీపై నిషేధం ఎత్తివేత... సుప్రీం కీలక నిర్ణయం

బ్యాంకులు, ఆర్థిక సంస్థలు క్రిప్టో కరెన్సీ సంబంధిత సేవలు అందించడానికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. 2018లో క్రిప్టో కరెన్సీ సేవలకు సంబంధించి ఆర్​బీఐ విధించిన నిషేధం ఇకపై చెల్లదని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.

SC allows banks to provide services on cryptocurrencies;
క్రిప్టో కరెన్సీ సేవలకు సుప్రీంకోర్టు అనుమతి

By

Published : Mar 4, 2020, 4:07 PM IST

Updated : Mar 4, 2020, 5:00 PM IST

క్రిప్టో కరెన్సీ సంబంధిత సేవలు అందించడానికి బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు సుప్రీంకోర్టు అనుమతించింది. 2018లో క్రిప్టో కరెన్సీ సేవలకు సంబంధించి ఆర్​బీఐ విధించిన నిషేధం ఇకపై చెల్లదని స్పష్టం చేసింది.

జస్టిస్ ఆర్​ఎఫ్​ నారిమన్​ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం... రిజర్వ్​ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్క్యులర్​ను పక్కన పెడుతున్నట్లు స్పష్టం చేసింది.

"ఆర్​బీఐ వర్చువల్ కరెన్సీని నిషేధించలేదని స్పష్టం చేస్తోంది. రెండు ముసాయిదా బిల్లులతో సహా పలు ప్రతిపాదనలతో అనేక కమిటీలు వచ్చినప్పటికీ భారత ప్రభుత్వం వీటిపై నిషేధం ఎత్తివేస్తున్నట్లు ప్రకటించలేదు. ఈ రెండు పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. అందువల్ల ఆర్​బీఐ క్రిప్టో కరెన్సీపై విధించిన నిషేధాన్ని ఇంకా కొనసాగించడం కుదరదు." - సుప్రీంకోర్టు 180 పేజీల తీర్పు సారాంశం

మోసాలకు ఆస్కారం!

2018 ఏప్రిల్ 6న భారతీయ రిజర్వు బ్యాంకు, తన నియంత్రణలో ఉండే బ్యాంకులు, ఆర్థిక సంస్ధలు... క్రిప్టోకరెన్సీ సేవలు నిర్వహించకుండా నిషేధం విధించింది.

డిజిటల్‌ కరెన్సీగా పిలిచే క్రిప్టోకరెన్సీకి సంబంధించిన లావాదేవీలను రహస్య సంకేతాలతో కూడిన పరిజ్ఞానం ద్వారా నిర్వహిస్తారు. నిజానికి వీటిని కేంద్ర బ్యాంకులు నియంత్రించలేవు. కనుక బిట్​కాయిన్​ లాంటి క్రిప్టో కరెన్సీ లావాదేవీల్లో మోసాలకు ఆస్కారం ఉందనే కారణంతో భారతీయ రిజర్వు బ్యాంకు నిషేధం విధించింది.

నిషేధంపై సవాల్ చేస్తూ ఇంటర్నెట్ అండ్​ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఐఎంఏఐ) సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కేంద్ర బ్యాంకు ఎలాంటి అధ్యయనం చేయకుండా, కేవలం 'నైతికత ప్రాతిపదికన' మాత్రమే నిషేధం విధించిందని వాదించింది. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు తాజాగా క్రిప్టో కరెన్సీ సంబంధిత సేవలకు అనుమతించింది.

ఇదీ చూడండి:హర్షవర్ధన్​ ప్రకటనతో స్టాక్​ మార్కెట్లు ఢమాల్

Last Updated : Mar 4, 2020, 5:00 PM IST

ABOUT THE AUTHOR

...view details