తెలంగాణ

telangana

ETV Bharat / business

ఏటీఎమ్​​ మోసాలకు చెక్‌.. నగదు విత్‌డ్రాకు ఓటీపీ - OTP based ATM cash withdrawal in SBI

ఏటీఎమ్​ మోసాలను అరికట్టేందుకు ఎస్​బీఐ నడుం బిగించింది. జనవరి 1 నుంచి ఏటీఎమ్​ నుంచి రూ.10 వేలు అంతకన్నా ఎక్కువ నగదు ఉపసంహరణకు ఓటీపీని తప్పనిసరి చేయాలని నిర్ణయించింది. రాత్రి 8 నుంచి ఉదయం 8 గంటల వరకు చేసే లావాదేవీలకు ఈ ఓటీపీ విధానం వర్తిస్తుందని ఎస్​బీఐ స్పష్టం చేసింది.

SBI to launch OTP based ATM cash withdrawal
ఏటీఎమ్​​ మోసాలకు చెక్‌.. నగదు విత్‌డ్రాకు ఓటీపీ

By

Published : Dec 27, 2019, 7:00 PM IST

ఏటీఎమ్​ మోసాలకు చెక్‌ పెట్టేందుకు ప్రభుత్వరంగ అతిపెద్ద బ్యాంక్‌ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) నడుం బిగించింది. ఏటీఎమ్​లో జనవరి 1 నుంచి రూ.10వేలు, అంతకు పైబడి నగదు ఉపసంహరణకు ఓటీపీని ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది. రాత్రి 8 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు చేసే లావాదేవీలకు ఓటీపీ విధానం వర్తిస్తుందని ఎస్‌బీఐ పేర్కొంది.

ఎస్‌బీఐ వినియోగదారులుఏటీఎమ్​లో నిర్దేశించిన సమయంలో నగదు విత్‌ డ్రా చేయడానికి వెళ్లేటప్పుడు స్క్రీన్‌పై ఓటీపీ అడుగుతుంది. వారి రిజిస్టర్‌ మొబైల్‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్‌ చేయడం ద్వారా లావాదేవీ జరపొచ్చు. ఓటీపీ ద్వారా కేవలం ఒక్క లావాదేవీ మాత్రమే చేయొచ్చని ఎస్‌బీఐ తెలిపింది. దీనివల్ల అనధికార లావాదేవీలను నివారించొచ్చని పేర్కొంది. ఎస్‌బీఐ వినియోగదారులు ఇతర ఏటీఎమ్​లలో గానీ, ఇతర బ్యాంకు కార్డు వినియోగదారులు ఎస్‌బీఐ ఏటీఎమ్​లలో గానీ ఈ సదుపాయాన్ని పొందలేరు. ఈ మార్పు చేయడానికి ఏటీఎమ్​లలో పెద్ద మార్పులేమీ అవసరంలేదని, జనవరి 1 నుంచి ఓటీపీ విధానం తీసుకొస్తున్నామని ఎస్‌బీఐ తెలిపింది. ఈ విధానం ద్వారా ఏటీఎమ్​ కేంద్రాల్లో క్లోనింగ్‌ కార్డుల ద్వారా జరిగే మోసాలకు చెక్‌ పెట్టేందుకు వీలవుతుంది.

ఇదీ చూడండి: రూపాయి అస్థిరతతో.. స్వల్పంగా పెరిగిన పసిడి ధరలు

ABOUT THE AUTHOR

...view details