తెలంగాణ

telangana

ETV Bharat / business

ఇంటి వద్దకే ఎస్‌బీఐ నగదు సేవ‌లు - ఎస్​బీఐ బ్యాంకింగ్​ సేవల సమాచారం

స్టేట్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా ఇకపై తమ వినియోగదారులకు నగదును ఇంటి వద్దనే అందించనుంది. ఇందుకుగాను కష్టమర్ల నుంచి కొంతమొత్తాన్ని వసూలు చేయనుంది.

sbi started doorstep banking services and know the charges
ఇంటి వద్దకే ఎస్‌బీఐ బ్యాంకింగ్ సేవ‌లు

By

Published : Jan 18, 2021, 5:47 PM IST

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తమ‌ వినియోగదారులకు డోర్ స్టెప్ బ్యాంకింగ్ సేవలను అందిస్తోంది. ఇక‌ నగదును కూడా డోర్​స్టెప్​ డెలివరీ సేవల కింద అందించనుంది. ఈ సౌకర్యంతో వినియోగదారులు వారి ఇంటి వద్ద బ్యాంకింగ్ సేవల సౌలభ్యాన్ని పొంద‌వ‌చ్చు.

'మీ బ్యాంక్ ఇప్పుడు మీ ఇంటి వద్ద ఉంది. ఈ రోజు డోర్​స్టెప్​ బ్యాంకింగ్ కోసం నమోదు చేయండి! టోల్ ఫ్రీ నం. 1800 1037 188 లేదా 1800 1213 721 కి కాల్ చేయండి' అని ఎస్‌బీఐ తెలిపింది. ఎస్‌బీఐ డోర్‌స్టెప్‌ బ్యాంకింగ్ సర్వీస్ సౌకర్యం వినియోగదారులకు ఇంటి వద్దే బ్యాంకింగ్ సేవల సౌకర్యాన్ని అందిస్తుంది.

ఎస్‌బీఐ డోర్‌స్టెప్‌ బ్యాంకింగ్ సర్వీస్ (డీఎస్‌బీ) గురించి తెలుసుకోవలసిన 10 విషయాలు:

  • డోర్‌స్టెప్‌ బ్యాంకింగ్ సేవలో నగదు పికప్, నగదు డెలివరీ, చెక్ పికప్, చెక్ రిక్విజిషన్ స్లిప్ పికప్, ఫారం 15 హెచ్ పికప్, డ్రాఫ్ట్ డెలివరీ, టర్మ్ డిపాజిట్ సలహా, లైఫ్ సర్టిఫికేట్ పికప్, కేవైసీ పత్రాల పికప్ ఉన్నాయి.
  • పని రోజులలో ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల మధ్య టోల్ ఫ్రీ నంబర్ 1800111103 కి కాల్ చేసి సేవ‌ల‌ను పొందవచ్చు.
  • రిజిస్ట్రేషన్ కోసం సేవా అభ్యర్థన అనేది హోమ్ బ్రాంచ్‌లో జరుగుతుంది.
  • డోర్‌స్టెప్‌ బ్యాంకింగ్ సేవ కేవైసీ పూర్తి చేసిన వినియోగ‌దారుల‌కు మాత్రమే అందుబాటులో ఉంది.
  • డోర్‌స్టెప్ బ్యాంకింగ్ సేవల ఛార్జీలు

ఆర్థిక సేవలు

నగదు డిపాజిట్- రూ. 75 - + జీఎస్‌టీ

నగదు చెల్లింపు / ఉపసంహరణ- రూ.75 + జీఎస్‌టీ

చెక్ పిక‌ప్‌ రూ. 75 + జీఎస్‌టీ

చెక్ బుక్ రిక్విజిషన్ స్లిప్ పిక‌ప్‌- రూ. 75 + జీఎస్‌టీ

ఆర్థికేతర సేవలు

టర్మ్ డిపాజిట్ సలహా, ఖాతా స్టేట్మెంట్ (సేవింగ్స్ బ్యాంక్ ఖాతా) - ఉచితం

కరెంట్ ఖాతా స్టేట్మెంట్ (డూప్లికేట్) రూ. 100 + జిఎస్‌టీ

  • నగదు ఉపసంహరణ, నగదు డిపాజిట్ మొత్తం రోజుకు రూ. 20,000 పరిమితం
  • హోమ్ బ్రాంచ్‌కు 5 కిలోమీటర్ల వ్యాసార్థంలో చెల్లుబాటు అయ్యే రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ఉన్న ఖాతాదారులు ఈ సేవలను పొందగలరు.
  • ఉమ్మ‌డి ఖాతాలు కలిగిన వినియోగదారులు ఈ సేవలను పొందలేరు.
  • చిన్న ఖాతా, వ్య‌క్తిగ‌తం కాని లేని ఖాతాలకు కూడా ఈ సేవ అందుబాటులో ఉండదు.
  • పాస్‌బుక్‌తో చెక్ / ఉపసంహరణ ఫారమ్‌ను ఉపయోగించి ఉపసంహరణకు అనుమతి ఉంటుంది.

ఎస్‌బీఐతో పాటు, హెచ్​డీఎఫ్​సీ, ఐసిఐసిఐ, యాక్సిస్, ఇండస్ఇండ్, కోటక్ మహీంద్రా వంటి బ్యాంకులు కూడా తమ వినియోగదారులకు డోర్ స్టెప్ బ్యాంకింగ్ సర్వీసుల సదుపాయాన్ని కల్పిస్తున్నాయి.

ఇదీ చూడండి: మరో ఆరు నెలల్లో వాట్సాప్​​లోకి జియోమార్ట్​!

ABOUT THE AUTHOR

...view details