దేశంలో అతిపెద్ద బ్యాంకు అయిన భారతీయ స్టేట్ బ్యాంక్.. రెండో త్రైమాసికంలో రూ.8,890 కోట్ల ఏకీకృత నికర లాభం ఆర్జించింది. గతేడాది ఇదే త్రైమాసికంతో పోల్చితే లాభాలు 69 శాతం వృద్ధి చెందాయి. మొండి బాకాయిలు భారీగా క్షీణించడం సంస్థకు దోహదపడింది. గత ఆర్థిక సంవత్సరం జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో బ్యాంక్ నికర లాభం రూ.5,245.88 కోట్లుగా ఉందని ఎస్‌బీఐ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది.
రెండో త్రైమాసికంలో ఎస్బీఐ గ్రూప్ ఆదాయం రూ.1,01,143కోట్లకు చేరింది. ఇంకా దీన్ని సమీక్షించాల్సి ఉంది. గతేడాది ఇదే సమయంలో సంస్థ మొత్తం ఆదాయం రూ.95,373కోట్లుగా ఉంది.