ఓటీపీ ఆధారంగా రూ.10వేలు, అంతకుమించి నగదు ఉపసంహరణ చేసే పద్ధతిని రోజంతా అమలు చేయనున్నట్లు ఎస్‌బీఐ ప్రకటించింది. ఈ సదుపాయం సెప్టెంబర్ 18 (ఇవాళ్టి) నుంచి వినియోగదారులకు అందుబాటులోకి వస్తుందని వెల్లడించింది.
దీని ప్రకారం.. డెబిట్‌కార్డు కలిగినవారు ఏటీఎంకు వెళ్లి, రూ.10,000, అంతకు మించి ఉపసంహరించాలంటే, రిజిస్టర్ మొబైల్‌కు వచ్చే ఓటీపీ కూడా నమోదు చేయాల్సి ఉంటుంది. డెబిట్ కార్డుతో పాటు బ్యాంకు వద్ద నమోదైన మొబైల్ నంబర్ కలిగి ఉంటేనే నగదు ఉపసంహరించే వీలుంటుంది.
జనవరిలో ప్రారంభించినా..
ఈ ఏడాది జనవరిలో ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చారు. అయితే నుంచి రాత్రి 8 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు మాత్రమే అమలయ్యేది.
సురక్షితంగా..
ఖాతాదారులు ఏటీఎం నుంచి నగదు ఉపసంహరణల విషయంలో మరింత సురక్షితంగా ఉండేందుకు ఇది ఉపయోగ పడుతుందని ఎస్‌బీఐ డిజిటల్ బ్యాంకింగ్ మేనేజింగ్ డైరెక్టర్ సీఎస్ శెట్టి పేర్కొన్నారు. కార్డులను స్కిమ్మింగ్ చేయడంకాని, క్లోనింగ్ చేయడం ద్వారా కాని ఖాతాదారుడికి సంబంధం లేకుండా నకిలీ డెబిట్ కార్డులతో ఏటీఎంల ద్వారా నగదు ఉపసంహరించుకునేందుకు అవకాశం లేకుండా చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బ్యాంకు యాజమాన్యం స్పష్టం చేసింది.
ఇదీ చూడండి:ఏటీఎం కార్డ్ లేకుండా వాచ్‌తో చెల్లింపులు