తెలంగాణ

telangana

ETV Bharat / business

స్టాక్ మార్కెట్లకు సెప్టెంబర్​లో ఒడుదొడుకులు! - స్టాక్ మార్కెట్ వార్తలు

ఆటుపోట్లు ఎదురైనా ఆగస్టులో భారీగా లాభాలను గడించిన స్టాక్ మార్కెట్లకు సెప్టెంబర్​లో మాత్రం ఒడుదుకులు తప్పేలా లేవు. అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో విదేశీ మదుపరుల పెట్టుబడులు నెమ్మదించడం వల్ల సెప్టెంబర్​లో ఒడుదొడుకులు ఎక్కువగా ఉంటాయని ఎస్​బీఐ మ్యూచువల్ ఫండ్ అంచనా వేసింది.

STOCKS MAREKTS OUTLOOK BY SBI
స్టాక్ మార్కెట్లపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రభావం

By

Published : Sep 8, 2020, 5:29 AM IST

సెప్టెంబరులో స్టాక్‌ మార్కెట్‌ ఒడుదొడుకులకు లోనయ్యే అవకాశం ఉందని ఎస్‌బీఐ మ్యూచువల్‌ ఫండ్‌ అంచనా వేసింది. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు విదేశీ మదుపరుల పెట్టుబడులు నెమ్మదించడం ఇందుకు కారణం అవుతుందని తెలిపింది.

విదేశీ సంస్థాగత మదుపరుల పెట్టుబడులు తరలి రావడం వల్ల ఆగస్టులో ఈక్విటీ మార్కెట్లు రాణించాయి. అయితే ఇక నుంచి స్థిరీకరణ అవుతాయని ఎస్‌బీఐ మ్యూచువల్‌ ఫండ్‌ ముఖ్య పెట్టుబడి అధికారి నవ్‌నీత్‌ మునోత్‌ అన్నారు. ఓ వైపు దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి -23.9 శాతానికి క్షీణించినా.. స్టాక్‌ మార్కెట్లు దూసుకెళ్తుండటంపై మదుపరులలో భయాలు కూడా పెరుగుతున్నాయని తెలిపారు.

మార్చిలోని కనిష్ఠ స్థాయుల నుంచి 40 శాతానికి పైగా సూచీలు పెరగడం గమనార్హం. 'స్వల్ప కాలంలో స్టాక్‌ మార్కెట్‌ ఎలా కదలాడుతుందో ఇప్పుడు చెప్పడం కష్టమే. అయితే అమెరికా అధ్యక్ష ఎన్నికల కారణంగా సెప్టెంబరులో సూచీలు ఒడుదొడుకులకు, స్థిరీకరణకు లోనుకావచ్చని' అన్నారు. సోమవారం ఎస్‌బీఐ మ్యాగ్నమ్‌ చిల్డ్రన్స్‌ బెనిఫిట్‌ ఫండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ను ఎస్‌బీఐ మ్యూచువల్‌ ఫండ్‌ విడుదల చేసింది. ఇది డెట్‌ ఆధారిత పొదుపు పథకం.

ఇదీ చూడండి:'జీడీపీ పతనం ఆందోళనకరం- అప్రమత్తత అత్యవసరం'

ABOUT THE AUTHOR

...view details