భారతీయ స్టేట్ బ్యాంక్(ఎస్బీఐ) సేవలకు శని, ఆదివారాల్లో అంతరాయం కలగనుంది. అక్టోబర్ 9న.. 00:20 గంటల నుంచి 2:20 గంటల వరకు (120 నిమిషాల పాట) సేవలు ఆగిపోనున్నాయి. అక్టోబర్ 10 అర్ధ రాత్రి 11:20 నుంచి అక్టోబర్ 11 ఉదయం 1:20 వరకు (120 నిమిషాలు) సేవలకు అంతరాయం ఏర్పడనుంది.
బ్యాంకింగ్ అంతర్గత వ్యవస్థలో అప్డేట్స్, మెయింటెనెన్స్ కారణంగా.. ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో, యోనో లైట్, యూపీఐ సేవలకు అంతరాయం ఏర్పడొచ్చని ఎస్బీఐ ట్విట్టర్ ద్వారా పేర్కొంది. అసౌకర్యానికి చింతిస్తున్నట్లు తెలిపింది.