తెలంగాణ

telangana

ETV Bharat / business

SBI-IMPS Limit: ఐఎంపీఎస్‌ లిమిట్‌ పెంచిన ఎస్‌బీఐ.. ఛార్జీలు ఇలా.. - ఎస్‌బీఐ ఐఎంపీఎస్‌ పరిమితి

SBI IMPS limit: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ).. ఇమిడియెట్‌ పేమెంట్‌ సర్వీస్​(ఐఎంపీఎస్‌) లావాదేవీ పరిమితిని రూ.5 లక్షలకు పెంచింది. ఆర్‌బీఐ మార్గదర్శకాల మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ప్రతి లావాదేవీకి రూ.20పైగా జీఎస్​టీ చెల్లించాల్సి ఉంటుందని ఎస్‌బీఐ తెలిపింది.

SBI-IMPS Limit
SBI-IMPS Limit

By

Published : Jan 4, 2022, 6:27 AM IST

SBI IMPS limit: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ).. ఇమిడియెట్‌ పేమెంట్‌ సర్వీస్​(ఐఎంపీఎస్‌) లావాదేవీ పరిమితిని రూ.5 లక్షలకు పెంచింది. ఆర్‌బీఐ మార్గదర్శకాల మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో గరిష్ఠంగా రూ.2 లక్షలుగా ఉన్న పరిమితిని రూ.5 లక్షలకు పెంచాలని బ్యాంకులకు ఆర్‌బీఐ గతేడాది అక్టోబర్‌లో సూచించింది. ఈ నేపథ్యంలో ఎస్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ప్రతి లావాదేవీకి రూ.20పైగా జీఎస్​టీ చెల్లించాల్సి ఉంటుందని ఎస్‌బీఐ తెలిపింది.

రోజులో ఎప్పుడైనా నగదు పంపుకొనేందుకు ఐఎంపీఎస్​ సాయపడుతుంది. ఆదివారాలు, సెలవు రోజుల్లో సైతం నగదు పంపుకొనే వెసులుబాటు ఉంది. ప్రస్తుతం వెయ్యి రూపాయల వరకు ఎలాంటి ఛార్జీలూ చెల్లించాల్సిన అవసరం లేదు. వెయ్యి నుంచి రూ.10 వేల వరకు రూ.2 పైగా జీఎస్​టీ, రూ.10వేలు నుంచి రూ.లక్ష వరకు రూ.4పైగా జీఎస్​టీ, రూ.1 లక్ష నుంచి రూ.2 లక్షల వరకు రూ.12పైగా జీఎస్​టీ చెల్లించాల్సి ఉంటుంది. కొత్తగా రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల శ్లాబ్‌ను ఎస్‌బీఐ ఏర్పాటు చేసింది.

ఇదీ చూడండి:భారీ నియామకాలతో.. ఫ్రెషర్స్​కు విప్రో శుభవార్త!

ABOUT THE AUTHOR

...view details