దేశంలోని అతిపెద్ద రుణదాత స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఎమ్సీఎల్ఆర్లో 5 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఇది ఫిబ్రవరి 10 నుంచి అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది.
ఎస్బీఐ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎమ్సీఎల్ఆర్లో కోత విధించడం... వరుసగా ఇది తొమ్మిదోసారి. ఈ తగ్గింపుతో, ఫండ్ బేస్డ్ రేటు (ఎమ్సీఎల్ఆర్) ఒక సంవత్సర ఉపాంత వ్యయం 7.90 శాతం నుంచి 7.85 శాతానికి తగ్గిందని బ్యాంకు ప్రకటించింది.
ఆర్బీఐ ప్రకటన తరువాత
ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్షలో... రెపోరేటును 5.15 శాతం యథావిధిగా ఉంచుతూ నిర్ణయం తీసుకుంది. అయితే లక్ష కోట్ల వరకు దీర్ఘకాలిక రెపో ఆపరేషన్ ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ఎస్బీఐ... ఎమ్సీఎల్ఆర్ తగ్గిస్తూ ప్రకటన చేసింది. ఈ నిర్ణయంతో గృహ, వాహన రుణాలు మరింత చౌకగా లభించనున్నాయి.