భారతీయ స్టేట్ బ్యాంకు వరుసగా 14వ సారి ఎంసీఎల్ఆర్ను తగ్గించింది. స్వల్పకాలిక రుణాలపై ఎంసీఎల్ఆర్ను 5 నుంచి 10 బేసిస్ పాయింట్లు వరకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. జులై 10 నుంచి ఈ తగ్గింపు అమలులోకి రానుంది.
మూడు నెలల కాలపరిమితి వరకు ఉండే స్వల్పకాలిక రుణాలకు మాత్రమే ఈ వడ్డీరేటు వర్తిస్తుంది. రుణ సామర్థ్యం పెంచడం, డిమాండ్ పునరుద్ధరించడమే లక్ష్యంగా ఎంసీఎల్ఆర్ను తగ్గించినట్లు ఎస్బీఐ తెలిపింది.