ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం భారతీయ స్టేట్ బ్యాంకు(ఎస్బీఐ) ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను 0.5 శాతం మేర తగ్గించింది.
ఆర్బీఐ వడ్డీ రేట్ల తగ్గుదల, లిక్విడిటీ పెరుగుదల కారణంగా టర్మ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు తగ్గించినట్లు ఎస్బీఐ పేర్కొంది. తగ్గిన వడ్డీ రేట్లు ఈ నెల 26 నుంచి అమలులోకి రానున్నాయి.
వడ్డీ రేట్ల తగ్గింపుపై ఇతర బ్యాంకులూ ఎస్బీఐ బాటలో పయనించే అవకాశముంది.
వడ్డీ తగ్గింపులు ఇలా..
7-45 రోజుల కాలావధి ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను 5 శాతం నుంచి 4.5 శాతం వరకు తగ్గించింది ఎస్బీఐ.
46-179 రోజుల కాలావధి డిపాజిట్లపై 5.5 శాతానికి, 180 నుంచి ఏడాది లోపు కాలావధి ఉన్న డిపాజిట్లపై 6 శాతానికి వడ్డీ తగ్గించింది. 1-2 ఏళ్ల కాలావధి ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లపై 10 బేసిస్ పాయింట్ల వడ్డీ మత్రమే తగ్గించింది ఎస్బీఐ.
అత్యధిక కాలావధి (5-10 ఏళ్లు) ఉన్న ఫిక్స్డ్ డిపాడిట్లపై 25 బేసిస్ పాయింట్ల వడ్డీ తగ్గించింది. ఈ కోతతో వడ్డీ రేటు 6.25 శాతానికి చేరింది.
ఇదీ చూడండి:వరుసగా నాలుగో రోజూ బంగారం ధర రికార్డు