ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) ఖాతాదారులకు శుభవార్త తెలిపింది. పొదుపు ఖాతాలకు(సేవింగ్స్ అకౌంట్) కనీస నిల్వ నిబంధనను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. వినియోగదారులందరికీ ఊరటనిచ్చేలా ఎస్ఎంఎస్ ఛార్జీలనూ రద్దు చేసింది.
ప్రస్తుత నిబంధన ఇలా..
నెలవారీగా ఎస్బీఐ ఖాతాల్లో రూ.3,000 (మెట్రో నగరాల్లో), రూ.2,000 (సెమీ అర్బన్), రూ.1,000 (గ్రామీణ ప్రాంతాల్లో) కనీస నిల్వ నిబంధన అమలులో ఉంది. ఖాతాదారులు కనీస నిల్వను నిర్వహించకపోతే రూ.5 నుంచి రూ.15 వరకు అపరాధ రుసుము కింద వసూలు చేస్తోంది.