తెలంగాణ

telangana

ETV Bharat / business

ఎస్​బీఐ న్యూ ఇయర్​ గిఫ్ట్​- గృహ రుణాలపై వడ్డీ తగ్గింపు - ఈబీఆర్​ను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన ఎస్​బీఐ

స్టేట్​ బ్యాంక్ ఆఫ్​ ఇండియా తన వినియోగదారులకు నూతన సంవత్సర కానుక అందించింది. వడ్డీరేటు(ఈబీఆర్​)ను 25 బేసిస్​ పాయింట్లు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఫలితంగా నూతన గృహ కొనుగోలుదారులకు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు తక్కువ వడ్డీకే రుణాలు లభించనున్నాయి.

SBI cuts external benchmark-based rate by 25 bps
ఎస్​బీఐ న్యూ ఇయర్​ గిఫ్ట్​- గృహ రుణాలపై వడ్డీ తగ్గింపు

By

Published : Dec 30, 2019, 12:46 PM IST

స్టేట్​ బ్యాంక్ ఆఫ్​ ఇండియా తన 'ఎక్స్​టర్నల్​ బెంచ్​మార్క్​ ఆధారిత వడ్డీ రేటు' (ఈబీఆర్​)ను 25 బేసిస్​ పాయింట్లు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఫలితంగా ఇప్పుడున్న ఈ కీలక వడ్డీ రేటు 8.05 నుంచి 7.80 శాతానికి దిగిరానుంది. ఈ కొత్త రేటు 2020 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుందని ఎస్​బీఐ స్పష్టం చేసింది. ఈబీఆర్​ తగ్గింపుతో.. గృహ, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (ఎమ్​ఎస్​ఎమ్​ఈ) రుణగ్రహీతలకు లాభం చేకూరనుంది.

మరింత సౌలభ్యం

ఎస్​బీఐ 2019 జులై 1 నుంచి ఈ ఫ్లోటింగ్ రేటు గృహరుణాలు మంజూరుచేస్తోంది. ఈబీఆర్​ తగ్గింపుతో ఇప్పుడున్న 8.15 శాతం వడ్డీరేటు.. నూతన సంవత్సరంలో 7.90 శాతానికి దిగిరానుంది.

ఆర్​బీఐ ఆదేశాలతో..

రిజర్వ్ బ్యాంకు ఆఫ్​ ఇండియా అన్ని బ్యాంకులను... ఒక నిర్దిష్ట వర్గాల రుణాలను ఈబీఆర్​కు అనుసంధానించాలని ఆదేశించింది. 'రెపోరేటు' తగ్గింపుపై బ్యాంకులు తాత్సారం చేయడమే ఇందుకు కారణం. ఆర్​బీఐ ఆదేశాల తరువాత ఎస్​బీఐ తన ఈబీఆర్​గా 'రెపోరేటు'ను స్వీకరించింది. 2019 అక్టోబర్ 1 నుంచి దీనిని ఆధారంగా చేసుకునే గృహ, ఎమ్​ఎస్​ఎమ్​ఈ, రిటైల్ రుణాలు అందిస్తోంది.​

ప్రయోజనాలు బదిలీ కావడం లేదు

ఆర్​బీఐ ఫిబ్రవరి నుంచి అక్టోబర్​ మధ్య రెపోరేటును 135 బేసిస్ పాయింట్లు వరకు తగ్గించింది. బ్యాంకులకు తమ ఈబీఆర్​ను మూడు నెలలకోసారి మార్చుకునేందుకు అవకాశమూ ఉంది. అయినప్పటికీ బ్యాంకులు ఇప్పటి వరకు మంజూరు చేసిన రుణాలపై వెయిటెడ్​ యావరేజ్​ లెండింగ్ రేటు (డబ్ల్యూఏఎల్​ఆర్​) 44 బేసిస్​ పాయింట్లు మాత్రమే తగ్గడం గమనార్హం.

ఇదీ చూడండి:2020లో ఆర్థికవ్యవస్థ పుంజుకునే అవకాశం: సీఐఐ

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details