తెలంగాణ

telangana

ETV Bharat / business

ఆ ఛార్జీల్ని రీఫండ్‌ చేసేశాం: ఎస్‌బీఐ క్లారిటీ - zero-balance accounts

జీరో బ్యాలెన్స్‌ ఖాతాల్లో నాలుగుకి మించి లావాదేవీలు చేస్తే విధించిన ఛార్జీలపై వివరణ ఇచ్చింది భారతీయ స్టేట్​ బ్యాంకు(ఎస్‌బీఐ). నాలుగు లావాదేవీలు మించి చేసిన డిజిటల్‌ చెల్లింపులపై వసూలు చేసిన ఛార్జీల్ని రీఫండ్‌ చేశామని తెలిపింది.

SBI
ఎస్‌బీఐ

By

Published : Apr 18, 2021, 5:46 AM IST

Updated : Apr 18, 2021, 9:11 AM IST

దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్‌బీఐ.. జీరో బ్యాలెన్స్‌ ఖాతాల్లో నాలుగుకి మించి లావాదేవీలు చేస్తే విధించిన ఛార్జీలపై వివరణ ఇచ్చింది. నాలుగు లావాదేవీలు మించి చేసిన డిజిటల్‌ లావాదేవీలపై వసూలు చేసిన ఛార్జీల్ని రీఫండ్‌ చేశామని వెల్లడించింది. పరిమితికి మించిన లావాదేవీలపై సహేతుకమైన ఛార్జీలు వసూలు చేసుకొనే వెసులుబాటును 2012 ఆగస్టులో ఆర్‌బీఐ కల్పించిందని పేర్కొంది. అందువల్లే, బేసిక్‌ సేవింగ్స్‌ బ్యాంకు డిపాజిట్‌ (బీఎస్‌బీడీ) ఖాతాదారులు నెలలో నాలుగు ఉచిత లావాదేవీల తర్వాత జరిపే ట్రాన్‌సెక్షన్స్‌పై ఛార్జీలు వసూలు చేసినట్టు తెలిపింది. 2016 జూన్‌ 15 నుంచి ఈ ఛార్జీలను వసూలు ప్రక్రియ అమలు జరిపినట్టు తెలిపింది. అలాగే, ఈ విషయంపై ఖాతాదారులకు ముందుగానే సమాచారమిచ్చినట్టు పేర్కొంది.

అయితే, 2020 జనవరి 1 తర్వాత డిజిటల్‌ లావాదేవీలపై విధించిన ఛార్జీలను తిరిగి ఖాతాదారులకు చెల్లించాలంటూ 2020 ఆగస్టులో కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ఆదేశాలు జారీ చేసిందని వెల్లడించింది. భవిష్యత్తులో డిజిటల్‌ లావాదేవీలపై ఛార్జీలు విధించరాదని సీబీడీటీ బ్యాంకులకు సూచించిందని తెలిపింది. సీబీడీటీ ఇచ్చిన ఆదేశాల మేరకు 2020 జనవరి 1 నుంచి 2020 సెప్టెంబర్‌ 14 వరకు జీరో బ్యాలెన్స్ ఖాతాదారుల డిజిటల్‌ లావాదేవీలపై విధించిన ఛార్జీలను రిఫండ్‌ చేసినట్టు వెల్లడించింది. ఆ తర్వాత సెప్టెంబర్‌ 15, 2020 నుంచి అలాంటి ఛార్జీలేమీ వసూలు చేయడం లేదని ఎస్‌బీఐ స్పష్టంచేసింది.

ఇదీ చూడండి:రెమిడెసివిర్​ ధర తగ్గించిన ఫార్మా సంస్థలు

Last Updated : Apr 18, 2021, 9:11 AM IST

ABOUT THE AUTHOR

...view details