ఎస్బీఐ కార్డు ఐపీఓ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ ఐపీఓ ద్వారా దాదాపు రూ.10,000 కోట్లకు పైగా సమీకరించాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటి వరకు ఎస్బీఐ కార్డ్ అండ్ పేమెంట్ సర్వీస్... స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు అనుబంధ సంస్థగా పనిచేస్తోంది.
ఎస్బీఐ కార్డు ఐపీవో విశేషాలు
- ఐపీఓ ప్రారంభం: మార్చి 2
- ఐపీఓ ముగింపు: మార్చి 5
- ఐపీఓ ధర: రూ.750 - రూ.755 మధ్య ఉండొచ్చు.
- ఐపీఓ ముగిశాక మే 16న షేర్లు మార్కెట్లో లిస్ట్ అయ్యే అవకాశం ఉంది.
లాట్ పరిమాణం- లిస్టింగ్ వివరాలు
- ఈ బిడ్‌లో 19 షేర్లను ఒక లాట్‌గా నిర్ణయించారు.
- మీకు ఎన్ని లాట్లు కావాలో నిర్ణయించుకుని దరఖాస్తు చేసుకోవాలి.
- ఒక వేళ షేరు ధర అత్యధికంగా నమోదైతే లాటుకు రూ.14,345 వరకు అవ్వవచ్చు.
- ఈ ఐపీఓకు 'లింక్ లైన్ టైమ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ రిజిస్టార్'గా వ్యవహరిస్తుంది.