పండుగ సీజన్ నేపథ్యంలో పలు సంస్థలు వినియోగదారులను ఆకట్టుకునేందుకు అదిరిపోయే ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. తాజాగా ఎస్‌బీఐ కార్డ్స్(Sbi Card Offers) తమ క్రెడిట్ కార్డు యూజర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుతో ఆన్‌లైన్ షాపింగ్ చేసే వారికి 10 శాతం క్యాష్‌బ్యాక్ ఇవ్వనున్నట్లు తెలిపింది. పైగా ఏ ఈ-కామర్స్ సంస్థ నుంచి కొనుగోలు చేసినా ఆఫర్ వర్తిస్తుందని(Sbi Card Offers) పేర్కొంది.
అలాగే మొబైల్స్, గృహోపకరణాలు, ఫ్యాషన్, లైఫ్‌స్టైల్, హోం డెకర్, కిచెన్ అప్లయన్సెస్.. ఇలా ఏ కేటగిరీలోని వస్తువులు కొన్నా.. క్యాష్‌బ్యాక్ ఇవ్వనున్నట్లు ఎస్‌బీఐ వెల్లడించింది. పైగా ఈఎంఐ ఆప్షన్ ఎంచుకున్నా ఈ ఆఫర్ వర్తించనున్నట్లు తెలిపింది. అయితే, కొనే సమయంలోనే ఈఎంఐ ఆప్షన్‌ని ఎంచుకోవాల్సి ఉంటుంది.