తెలంగాణ

telangana

ETV Bharat / business

ఎస్​బీఐ కార్డ్​ వినియోగదారులకు ఇక వీకేవైసీ

వినియోగదారుడి ఆన్​ బోర్డు ప్రక్రియను నిర్ధరించటానికి వీడియోతో కూడిన కేవైసీని అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఎస్​బీఐ కార్డు ప్రకటించింది. దీని ద్వారా మోసాలను తగ్గించటమే కాకుండా కేవైసీ ప్రక్రియ మరింత సులభతరం అవుతుందని తెలిపింది.

SBI Card launches video based customer identification process
ఇకపై ముఖ కవళికలతో కేవైసీ ప్రక్రియ

By

Published : Jun 15, 2020, 8:05 PM IST

ఎస్​బీఐ కార్డు సరికొత్త ఫీచర్​ను తీసుకువస్తున్నట్లు తెలిపింది. వినియోగదారుని సౌలభ్యం కోసం వీడియోతో కూడిన కేవైసీని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ప్రక్రియ ఆన్​లైన్​ మోసాలను తగ్గించటమే కాకుండా కేవైసీకి అయ్యే ఖర్చును కూడా సగానికి చేస్తుందని సంస్థ తెలిపింది. ప్రస్తుతం ఉన్న భౌతిక దూరం నిబంధనల దృష్ట్యా ఇది వినియోగదారులకు ఉపకరిస్తుందని వెల్లడించింది.

ముఖ కవళికలు, డైనమిక్​ వెరిఫికేషన్​ కోడ్​, లైవ్​ ఫోటో స్కానింగ్​, జియో ట్యాగింగ్​, ఇతర పద్ధతుల ద్వారా వీకేవైసీ పని చేస్తుంది. కేవైసీ ప్రక్రియ కంటే ఈ విధానం చాలా సురక్షితంగా, సులభంగా ఉంటుందని ఎస్​బీఐ కార్డు వెల్లడించింది.

"మాది టెక్నాలజీ ఆధారిత కంపెనీ. మా వినియోగదారులకు అందించే సేవలను మెరుగుపరచటానికి బ్యాక్​ ఎండ్​, ఫ్రంట్​ ఎండ్​ వద్ద అత్యాధునిక మౌలిక సదుపాయాలను రూపొందించటానికి భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టాము. వినియోగదారుని ప్రతి కదలికను డిజిటలైజ్​ చేయటానికి, సులభతరం చేయటానికి ప్రయత్నిస్తున్నాం."

-హర్దియాల్​ ప్రసాద్​, ఎస్​బీఐ కార్డు ఎండీ, సీఈఓ

ఇటీవల ఆర్​బీఐ ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగానే ఈ వీకేవైసీను ప్రారంభించినట్లు స్పష్టం చేశారు.

ఇదీ చూడండి:ఎదురులేని ఆల్టో- వరుసగా 16వ సారి నెంబర్​-1

ABOUT THE AUTHOR

...view details