భారత్ 75వ స్వాతంత్య్ర దినోత్సావాన్ని ఘనంగా జరుపుకుంది. ఈ సందర్భంగా భారతీయ అతిపెద్ద బ్యాంక్ ఎస్‌బీఐ(స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) వివిధ రిటైల్ రుణాలపై ప్రాసెసింగ్ ఫీజలు రద్దు చేయడం సహా వడ్డీ రేట్లను కూడా తగ్గించింది.
గృహ రుణాలపై పరిమిత కాలం వరకు 100 శాతం ప్రాసెసింగ్ ఫీజును రద్దు చేస్తున్నట్లు ఎస్‌బీఐ గతంలోనే ప్రకటించింది. అయితే తాజాగా కారు రుణాలను కూడా 100 శాతం ప్రాసెసింగ్ ఫీజులు లేకుండా అందిస్తుంది. ఇది కూడా పరిమిత కాల ఆఫర్ మాత్రమే. 2022, జనవరి 1 వరకు అమలులో ఉంటుంది. అంతేకాకుండా వినియోగదారులు కారు ఆన్-రోడ్ ధరపై 90 శాతం వరకు రుణాల పొందొచ్చు.
యోనో యాప్‌తో వడ్డీ రాయితీ..
యోనో యాప్ ద్వారా కారు రుణం కోసం దరఖాస్తు చేసుకున్నవారికి 25 బేసిస్ పాయింట్లు(బీపీఎస్) మేర వడ్డీ రాయితీ ఆఫర్ చేస్తుంది ఎస్‌బీఐ. యోనో యాప్ వినియోగదారులు కొత్త కారు కొనుగోలు చేయాలని ప్లాన్‌లో ఉంటే 7.5 శాతం అతి తక్కువ వార్షిక వడ్డీతో రుణం తీసుకోవచ్చు.
అదేవిధంగా బంగారంపై రుణాలను తీసుకునే వారికి కూడా 75 బేసిస్ పాయింట్లు మేర వడ్డీ రేటు తగ్గిస్తున్నట్లు ఎస్‌బీఐ తెలిపింది. ఖాతాదారులు ఏ ఛానల్ ద్వారా(ఆన్‌లైన్, ఆఫ్‌లైన్, యోనోయాప్) అయినా 7.5 శాతం వార్షిక వడ్డీతో బంగారంపై రుణాలను పొందవచ్చు. యోనో యాప్ ద్వారా దరఖాస్తు చేసుకున్న వారికి ప్రాసెసింగ్ ఫీజు కూడా మాఫీ చేస్తుంది.
ఎస్‌బీఐ వ్యక్తిగత, పెన్షన్లోన్ వినియోగదారులు ఏ ఛానల్ ద్వారా రుణం తీసుకున్నప్పటికి 100 శాతం ప్రాసెసింగ్ ఫీజును రద్దు చేస్తున్నట్లు బ్యాంక్ ప్రకటించింది.
కొవిడ్ వారియర్స్‌కు ప్రత్యేక రాయితీలు..