రోజురోజుకు విజృంభిస్తున్న కరోనాతో తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న భారత్ త్వరగా కోలుకోవాలని సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఆకాంక్షించారు. భారత్‌లో కొవిడ్.. తీవ్ర వినాశనాన్ని సృష్టిస్తోందన్నారు.
"భారత్‌కు అవసరమైన వైద్య సామాగ్రి కొనుగోలు కోసం 'గివ్ ఇండియా' ఫౌండేషన్‌తో పాటు.. యునిసెఫ్‌కు గూగుల్ రూ.135 కోట్ల నిధులు సమకూర్చింది. దీనికి గూగుల్ ఉద్యోగులు సైతం తమ వంతు సహకారం అందించారు."
-సుందర్ పిచాయ్, గూగుల్ సీఈఓ
అలాగే ఈ కరోనా సమయంలో అవసరమైన కీలక సమాచారాన్ని వ్యాప్తి చేసేందుకు గూగుల్ నిధులను అందిస్తుందని సుందర్ పిచాయ్ వివరించారు. ముఖ్యంగా కరోనా ముప్పు అధికంగా ఉన్న వారికి సహకారం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
సత్య నాదెళ్ల సందేశం..