తెలంగాణ

telangana

ETV Bharat / business

సంవత్‌ 2077లో ఏ షేర్లు కొంటే మంచిది? - Stock markets

ఎన్నో ఒడుదొడుకుల మధ్య సంవత్​ 2076 గడిచిపోయింది. కనిష్ఠ స్థాయికి పడిపోయిన స్టాక్‌ మార్కెట్లు... క్రమంగా పుంజుకుంటూ సరికొత్త శిఖరాలను అధిరోహించాయి. ఈ తరుణంలో ఈ దీపావళి నుంచి సంవత్‌ 2077 ప్రారంభం కానుంది. సూచీలు రికార్డు గరిష్ఠాల వద్ద ఉన్న నేపథ్యంలో షేర్లు కొనడం మేలా, కాదా?

Samvat 2077: Samco Securities suggests these 10 stocks for rocket portfolio
సంవత్‌ 2077లో ఏ షేర్లు కొంటే మంచిది?

By

Published : Nov 13, 2020, 6:57 AM IST

తీపి, చేదు జ్ఞాపకాల సమ్మేళనంగా సంవత్‌ 2076 గడిచిపోయింది. స్టాక్‌ మార్కెట్‌ చరిత్రలో మరపురానిదిగా నిలిచిపోతుంది. జీవనకాల గరిష్ఠ స్థాయిల వద్ద కళకళలాడుతూ కనిపించిన సూచీలు.. కరోనా ధాటికి ఒక్కసారిగా వెలవెలబోయాయి. సంవత్సరాల నాటి కనిష్ఠాలకు దిగివచ్చాయి. మళ్లీ ఎప్పుడు కోలుకుంటాయోనని అనుకుంటుండగానే.. క్రమక్రమంగా పుంజుకుంటూ తిరిగి 4 నెలల్లోనే సరికొత్త శిఖరాలను అధిరోహించాయి. ఇంత స్వల్ప కాలంలో ఉత్థానం నుంచి పతనానికి.. పతనం నుంచి ఉత్థానానికి సూచీలు కదలాడటం బహుశా ఇదే తొలిసారి. ఈ దీపావళి నుంచి సంవత్‌ 2077 ప్రారంభం కానుంది. సూచీలు రికార్డు గరిష్ఠాల వద్ద ఉన్న ఈ తరుణాన షేర్లు కొనడం మేలా, కాదా? అనే సందేహాల మధ్య మనం కొత్త సంవత్‌లోకి అడుగుపెడుతున్నాం.

కరోనా పరిణామాల ప్రభావం నుంచి దేశ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికీ పూర్తిగా బయటపడలేదు. కానీ స్టాక్‌ మార్కెట్‌ బలంగా పుంజుకుంది. ప్రపంచ మార్కెట్లతో పాటే రికార్డు గరిష్ఠ స్థాయిలను చేరింది. గతేడాది తరహాలోనే సంవత్‌ 2077లో సెన్సెక్స్‌, నిఫ్టీలు రెండంకెల వృద్ధిని నమోదు చేస్తాయా అనేది చూడాల్సి ఉంది. ఇందుకు విదేశీ పెట్టుబడులూ ప్రధానమే. ఏ షేరైనా బాగా పెరిగినప్పుడు.. ఇంకా పెరుగుతుందో లేదోననే భయంతో ఆ షేరుకు దూరంగా ఉంటుండటం చాలా మంది మదుపర్లు సర్వసాధారణంగా చేసే పని. అయితే సూచీలు కొత్త శిఖరాలను తాకినా, వాటిల్లోని షేర్లన్నీ కూడా ఆ స్థాయిలో పెరగలేదు. కొన్ని షేర్లే దూసుకెళ్తూ, తమతో సూచీలను పైకి తీసుకెళ్లాయి. కానీ కొత్త శిఖరాలపై సూచీలు సవారీ చేస్తున్నప్పుడు ఏమాత్రం ప్రతికూల పరిణామాలు సంభవించినా, తదుపరి మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి నెలకొంటుంది. అందుకే ఈసారి షేర్ల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఆర్థిక వ్యవస్థ పనితీరుకు భిన్నంగా ఇప్పటివరకు స్టాక్‌ మార్కెట్‌ వ్యవహరించినప్పటికీ.. మున్ముందూ ఇలాగే చలిస్తుందని అనుకోలేం. అమెరికా కొత్త అధ్యక్షుడి రాకతో మున్ముందు ప్రపంచ మార్కెట్లు ఎలా స్పందిస్తాయనే విషయం ఆసక్తికరం. కొవిడ్‌ వ్యాక్సిన్‌ వచ్చేవరకు ఆర్థిక పరిస్థితుల్లో కొంత అనిశ్చితి తప్పదు. అందువల్ల షేర్లను ఎంపిక చేసుకోవడం మదుపర్లకు కత్తి మీద సాములాంటిదే. పటిష్ఠ మూలాలున్న కంపెనీలను గుర్తించడం, మధ్య, చిన్న తరహా కంపెనీల షేర్ల విషయంలో ఆచితూచి అడుగులు వేయడం లాంటి కొన్ని జాగ్రత్తలు పాటిస్తే కొత్త సంవత్‌లోనూ ప్రతిఫలాలను పొందొచ్చని బ్రోకరేజీ సంస్థలు చెబుతున్నాయి. సంవత్‌ 2077కి ఆయా బ్రోకరేజీ సంస్థల సిఫారసులు పట్టికలో...

సెన్సెక్స్​, నిఫ్టీల్లో పెరుగుదల

గమనించాల్సిన అంశాలివీ

దేశీయంగా..

  • కొవిడ్‌ వ్యాక్సిన్‌ అభివృద్ధి, ప్రజలకు చేరడం
  • వృద్ధి రేటు తిరిగి గాడిన పడటం
  • కరోనా ప్రభావం నుంచి ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించేందుకు ప్రభుత్వ ఉద్దీపనలు
  • ఇప్పటికే అమలు చేస్తున్న పథకాల ఫలితాలు
  • ఆర్‌బీఐ పరపతి విధాన సమీక్ష నిర్ణయాలు
  • కార్పొరేట్‌ కంపెనీల ఆర్థిక ఫలితాలు
  • ద్రవ్యోల్బణం, ద్రవ్యలోటు సహా ఇతర ఆర్థిక గణాంకాలు
  • రూపాయి కదలికలు

అంతర్జాతీయంగా..

  • అమెరికా కొత్త అధ్యక్షుడు వాణిజ్యపరంగా, పాలనాపరంగా తీసుకునే చర్యలు
  • ముడి చమురు, వివిధ కమొడిటీల ధరలు
  • డాలరు సహా కీలక కరెన్సీల కదలికలు
  • ఫెడ్‌ నిర్ణయాలు
  • విదేశీ సంస్థాగత మదుపర్ల పెట్టుబడులు
కంపెనీల షేర్ల ధరలు
కంపెనీల షేర్ల ధరలు
కంపెనీల షేర్ల ధరలు
కంపెనీల షేర్ల ధరలు

ఎక్కువ ఓట్లు వీటికే..:భారతీ ఎయిర్‌టెల్‌, ఇన్ఫోసిస్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, ఎస్‌బీఐ లైఫ్‌ షేర్లను ఎక్కువ బ్రోకరేజీ సంస్థలు సిఫారసు చేస్తున్నాయి.

ఇదీ చూడండి:'సింగిల్స్ డే' పేరిట 11రోజుల్లో రూ.5లక్షల కోట్ల అమ్మకాలు!

ABOUT THE AUTHOR

...view details