తెలంగాణ

telangana

ETV Bharat / business

600ఎంపీ కెమెరాతో శాంసంగ్​ నయా ఫోన్​ - సంస్థ

600 మెగా పిక్సెల్ కెమెరాతో సరికొత్త ఫోన్​ను మార్కెట్​లో తీసుకురానున్నట్లు స్మార్ట్​ఫోన్ల తయారీ దిగ్గజం శాంసంగ్​ తెలిపింది. ఇప్పటికే 108 మెగా పిక్సెల్ సెన్సార్​ ఫోన్​తో స్మార్ట్ ఫోన్ పరిశ్రమలో సంచలనం సృష్టించిన శాంసంగ్​.. తాజా ప్రకటనతో ప్రత్యర్థి సంస్థలకు షాకిచ్చింది.

Samsung to launch camera sensors that work better than human eyes
శాంసంగ్​ సెన్సార్లు.. మనిషి కళ్ల కంటే పవర్​ఫుల్​

By

Published : Apr 22, 2020, 8:55 PM IST

దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ దిగ్గజ సంస్థ శాంసంగ్​ సరికొత్త ఫోన్​ సెన్సార్​ ఫోన్​ను తీసుకురానున్నట్లు ప్రకటించింది. అత్యంత శక్తివంతమైన ఇమేజ్ సెన్సార్ ను రూపొందిస్తున్నట్లు సంచలన ప్రకటన చేసి ప్రత్యర్థి సంస్థలను ఆశ్చర్యంలో ముంచెత్తింది.

కన్ను కంటే పవర్​ఫుల్​

600 ఎంపీ రిజల్యూషన్‌తో మనిషి కంటి కంటే శక్తివంతమైన ఇమేజ్ సెన్సార్ ను రూపొందిస్తున్నట్లు శాంసంగ్ సెన్సార్ బిజినెస్ టీమ్ యాంగిన్ పార్క్ తెలిపారు. అలాగే వాసనలు, రుచులు తెలిపే ఇతర విభిన్న సెన్సార్లపైనా దృష్టి పెట్టినట్లు పేర్కొన్నాారు.

" ఇమేజ్​ సెన్సార్లను అభివృద్ధి చేయడమే కాకుండా.. వాసనలు, రుచులు తెలిపే సెన్సార్ల తయారీపైనా దృష్టి పెట్టాం. మనిషి కళ్లనే మించిన సెన్సార్లను త్వరలో అందుబాటులోకి తీసుకొస్తాం. సాధారణంగా కనిపించనవి సైతం వీటి ద్వారా చూడవచ్చు. మన కళ్లకు మించి సామర్థ్యం ఉన్న వీటిని అందుబాటులోకి తీసుకొస్తున్నందుకు సంతోషంగా ఉంది."

-- యాంగిన్ పార్క్​, శాంసంగ్​ సెన్సార్​ బిజినెస్​ టీమ్​ చీఫ్​

జోరుమీదున్న శాంసంగ్​

విభిన్న స్మార్ట్​ఫోన్లను అందుబాటులోకి తీసుకురావడంలో శాంసంగ్ ఎప్పుడూ​ ముందుంటుంది. 2019 మే నెలలో శాంసంగ్ మొట్టమొదటి సారిగా 64 మెగా పిక్సెల్ కెమెరా ఫోన్​ను లాంచ్​ చేసింది. ఆరు నెలల తర్వాత 108 మెగా పిక్సెల్ కెమెరాను తీసుకొచ్చి మరోసారి షాకిచ్చింది. ఈ ఏడాది గెలాక్సీ ఎస్​ 20 ఆల్ట్రా స్మార్ట్​ఫోన్​ను విడుదల చేసింది. ఇవే కాకుండా 0.7 మెగా పిక్సెల్ ఆధారిత ఇమేజ్​ సెన్సార్లను ప్రవేశపెట్టిన మొదటి సంస్థ శాంసంగే కావడం గమనార్హం.

ఇదీ చదవండి:వాట్సాప్​లో ఒకేసారి 8 మందితో వీడియో​ కాల్​

ABOUT THE AUTHOR

...view details