కరోనా భయంతో చేతులను ఎప్పటికప్పుడు శుభ్రంగా కడుక్కొంటున్నాం సరే. పదే పదే ఉపయోగించే ఫోన్, ఇయర్‌బడ్స్ వంటి వాటి పరిస్థితి ఏమిటి? వాటిపై ఉండే క్రిములు, బాక్టీరియా వల్ల మనం అనారోగ్యం పాలయ్యే అవకాశం లేకపోలేదు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని నూతన యూవీ స్టెరిలైజర్‌ను విడుదల చేసింది శాంసంగ్. ఈవారంలోనే మార్కెట్లోకి అందుబాటులోకి వస్తుందని వెల్లడించింది. వైర్లెస్ ఛార్జింగ్ సదుపాయం ఉన్నట్లు తెలిపింది.
" యూవీ స్టెరిలైజర్ ద్వారా గెలాక్సీ స్మార్ట్ఫోన్లు, గెలాక్సీ ఇయర్‌బడ్స్, స్మార్ట్ వాచ్ వంటి వాటిపై ఉన్న క్రిములను అంతం చేయొచ్చు. మన వ్యక్తిగత రోజువారీ వస్తువులను క్రిమిరహితంగా, సురక్షితంగా ఉంచేందుకు సరైన, కాంపాక్ట్ పరికరం ఇది. దీని ధర రూ. 3,599గా ఉంది."
-మోహన్‌దీప్ సింగ్, శాంసంగ్ ఇండియా మొబైల్స్ సీనియర్ ఉపాధ్యక్షులు