తెలంగాణ

telangana

ETV Bharat / business

7కే బ్యాటరీతో శాంసంగ్ కొత్త ఫోన్ - శాంసంగ్​ గెలాక్సీ ఎఫ్​2 అప్డేట్స్​

కొత్త టెక్నాలజీతో కూడిన మొబైళ్లను మార్కెట్లోకి తీసుకొచ్చి వినియోగదారులను ఆకర్షించే శాంసంగ్​.. మరో కొత్త ఫోన్​ను తీసుకొచ్చింది. బడ్జెట్​, రేంజ్​లో ఆకర్షణీయమైన ఫీచర్స్​తో శాంసంగ్​ గెలాక్సీ ఎఫ్​62 మోడల్​ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఆ ఫోన్​ ధర, ఫీచర్స్​ తదితర వివరాలు మీకోసం...

SAMSUNG LAUNCHES GALAXY F62 MODEL IN INDIA
7కే బ్యాటరీతో శాంసంగ్ కొత్త ఫోన్

By

Published : Feb 16, 2021, 5:03 AM IST

ఆన్‌లైన్/ఆఫ్‌లైన్ మొబైల్ మార్కెట్‌ అమ్మకాల్లో తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది శాంసంగ్. బడ్జెట్, మిండ్‌ రేంజ్‌లో ఆకర్షణీయమైన ఫీచర్స్‌తో కొత్త మోడల్స్‌ను తీసుకొస్తూ అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటోంది. తాజాగా గెలాక్సీ ఎఫ్‌62 పేరుతో కొత్త మోడల్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. పెద్ద బ్యాటరీ సామర్థ్యంతో తీసుకొచ్చిన ఈ మోడల్‌లో క్వాడ్ రియర్ కెమెరా, పంచ్‌ హోల్ డిస్‌ప్లే, ఎగ్జినోస్ ప్రాసెసర్‌, ఫోన్ వెనక వైపు మెటల్‌ ఫినిషింగ్ వంటి ఫీచర్స్ ఇస్తున్నారు. గతేడాది విడుదల చేసిన గెలాక్సీ ఎఫ్41 మోడల్‌కి కొనసాగింపుగా ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న వన్‌ప్లస్‌ నార్డ్, రియల్‌మీ ఎక్స్‌3 సూపర్‌ జూమ్, రియల్‌మీ ఎక్స్‌ 5జీ మోడల్స్‌తో గెలాక్సీ ఎఫ్62 పోటీపడనుంది. మరి ఈ ఫోన్‌లో ఫీచర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం..

శాంసంగ్ గెలాక్సీ ఎఫ్‌62

ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 11 ఆధారిత వన్‌ యూఐ 3.1 ఓఎస్‌తో పనిచేస్తుంది. 6.7-అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ సూపర్ అమోలెడ్ ప్లస్‌ ఇన్ఫినిటీ-ఓ డిస్‌ప్లే ఇస్తున్నారు. ఇందులో ఎగ్జినోస్ 9825 ప్రాసెసర్ ఉపయోగించారు. గేమింగ్ ప్రియుల కోసం మాలి జీ76 జీపీయూ (గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్) ఇస్తున్నారు. ఎఫ్62లో ఐదు కెమెరాలున్నాయి. వెనక వైపు 64 ఎంపీ సోనీ ఐఎంఎక్స్682 ప్రైమరీ సెన్సర్‌తో పాటు 12 ఎంపీ అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా, రెండు 5 ఎంపీ కెమెరాలు ఇస్తున్నారు. ముందు భాగంలో 32 ఎంపీ సెల్ఫీ కెమెరా అమర్చారు. ఈ ఫోన్‌లో ముందు, వెనక కెమెరాలు 4K వీడియో రికార్డింగ్ క్వాలిటీని ఇస్తాయి. అలానే సింగిల్ టేక్‌లో 14 (10 ఫొటోలు, 4 వీడియోలు) రకాల అవుట్‌పుట్‌లను అందిస్తాయి.

గెలాక్సీ ఎఫ్‌62లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది బ్యాటరీ సామర్థ్యం. 7,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇస్తున్నారు. అంతేకాదు, ఇది 25వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో పాటు రివర్స్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. రెండు వేరియంట్లలో ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు. 6జీబీ ర్యామ్‌/128జీబీ మెమొరీ వేరియంట్ ధర రూ. 23,999, 8జీబీ ర్యామ్‌/128జీబీ ధర రూ. 25,999. లేజర్ బ్లూ, లేజర్ గ్రీన్, లేజర్ గ్రే రంగుల్లో లభిస్తుంది. శాంసంగ్‌ ఇండియా, ఫ్లిప్‌కార్ట్‌, ఇతర ఆన్‌లైన్‌ స్టోర్లతో పాటు ఎంపిక చేసిన రిటైల్ స్టోర్లలో ఫిబ్రవరి 22 నుంచి అమ్మకాలు ప్రారంభంకానున్నాయి.

ఇదీ చదవండి:వాట్సాప్‌లో ఈ ఫీచర్ల గురించి తెలుసా..?

ABOUT THE AUTHOR

...view details