తెలంగాణ

telangana

ETV Bharat / business

అవినీతి కేసులో శాంసంగ్‌ వైస్​ ఛైర్మన్​కు 9ఏళ్ల జైలు! - సాంమ్​సంగ్​ వైస్​ ఛైర్మన్​కు జైలు శిక్ష

ప్రముఖ టెక్​ దిగ్గజ సంస్థ శాంసంగ్​కు ఆ దేశ కోర్టు షాక్​ ఇచ్చింది. మాజీ అధ్యక్షుడు జియున్​-హేకు లంచం ఇవ్వజూపిన కేసులో ఆ సంస్థ వైస్​ ఛైర్మన్​ లీ జే యంగ్​కు జైలు శిక్ష ఖరారు కానుంది. ఇందుకు సంబంధించిన తుది తీర్పు జనవరి 18న వెలువడనుంది.

Samsung heir faces 9 years in prison over bribery case
అవినీతి కేసులో శామ్‌సంగ్‌ వైస్​ ఛైర్మన్​కు జైలుశిక్ష‌

By

Published : Dec 31, 2020, 9:57 PM IST

దక్షిణ కొరియాకు చెందిన టెక్‌ దిగ్గజ సంస్థ అయిన శాంసంగ్​ వైస్​ ఛైర్మన్​ లీ జే-యంగ్​ అవినీతి ఆరోపణల కేసులో జైలుకు వెళ్లనున్నట్లు స్థానికి మీడియా తెలిపింది. ఈ కేసుతో ఆ దేశ మాజీ అధ్యక్షుడు పార్క్​ జియున్​-హేకు సంబంధం ఉన్నట్లు పేర్కొంది.

బుధవారం జరిగిన విచారణ సందర్భంగా 'లీ'కు తొమ్మిదేళ్ల జైలు శిక్ష అమలు చేయాలని పిటిషనర్​ తరుపు న్యాయవాది కోరినట్లు వెల్లడించింది. అయితే ఇందుకు సంబంధించిన తుది తీర్పను వచ్చే ఏడాది జనవరి 18కు వాయిదా వేసింది కోర్టు.

ఈ కేసులో ఇద్దరు మాజీ ఎగ్జిక్యూటివ్​లకు కూడా ఏడేళ్ల జైలు శిక్ష అమలు చేయాలని న్యాయవాది కోరారు.

ఇదీ చూడండి: శామ్‌సంగ్‌ ఛైర్మన్‌ లీకున్‌ హీ కన్నుమూత

ABOUT THE AUTHOR

...view details