శాంసంగ్ గెలాక్సీ స్మార్ట్ వాచ్ యాక్టివ్ 2లో 'ఈసీజీ' ఫీచర్ను అనుసంధానించడానికి దక్షిణ కొరియా ఆహార, ఔషధ భద్రత మంత్రిత్వశాఖ అనుమతి ఇచ్చింది. అలాగే 'హెల్త్ మానిటర్' యాప్ ఉపయోగించి రక్తపోటు పరీక్షలు నిర్వహించడానికి కూడా క్లియరెన్స్ ఇచ్చింది.
"శాంసంగ్ గెలాక్సీ వాచ్ యాక్టివ్ 2లో ఈసీజీ ఫీచర్ అనుసంధానించడానికి అనుమతి లభించినందుకు ఆనందంగా ఉంది. ఇకపై మా వినియోగదారులు హెల్త్ మానిటర్ యాప్ను ఇన్స్టాల్ చేసుకొని.. బటన్పై లాంగ్ ప్రెస్ చేసి ఈసీజీ రీడింగ్ తెలుసుకోవచ్చు. అంటే వినియోగదారులు స్వయంగా తమ గుండె లయను, రక్తపోటును తెలుసుకోగలుగుతారు. "
- శాంసంగ్ ట్వీట్