తెలంగాణ

telangana

ETV Bharat / business

శామ్​సంగ్​ కొత్త ఫోన్​లో ఆ మూడే హైలైట్​! - Samsung

శామ్​సంగ్ నుంచి మరో కొత్త మొబైల్​ వినియోగదారులకు చేరువైంది. గెలాక్సీ సిరీస్​ నుంచి వచ్చిన 'శామ్​సంగ్​ గెలాక్సీ ఏ90'.. 5జీ సాంకేతికతో పనిచేస్తుంది. ప్రస్తుతం దక్షిణ కొరియాలో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ మొబైల్​ ఫోన్లు ఇరత దేశాల మార్కెట్లోకి వచ్చేందుకు మరింత సమయం పట్టనుంది. ​

శామ్​సంగ్​ కొత్త ఫోన్​లో ఆ 3 కెమెరాలే హైలైట్​!

By

Published : Sep 3, 2019, 1:54 PM IST

Updated : Sep 29, 2019, 7:01 AM IST

దక్షిణ కొరియాకు చెందిన ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ దిగ్గజం శామ్​సంగ్‌.. 5జీ సాంకేతికతతో సరికొత్త ఫోన్​ను ఆవిష్కరించింది. గెలాక్సీ సిరీస్​కు చెందిన 'శామ్​సంగ్​ గెలాక్సీ ఏ90'ను మార్కెట్లోకి విడుదల చేసింది. క్వాల్​కామ్​​ స్నాప్​డ్రాగన్​ 855 ప్రాసెసర్​తో పాటు 5జీ టెక్నాలజీకి అనువుగా స్నాప్​డ్రాగన్​ ఎక్స్​50 5జీ మోడెమ్​ను ఈ ఫోన్​లో అనుసంధానం చేశారు.

సోనీ ఐఎమ్​ఎక్స్​586 సెన్సార్​తో పనిచేసే అత్యాధునిక కెమెరాలు వినియోగదారులను ఆకట్టుకోనున్నాయి. గెలాక్సీ ఏ90లో 48 మెగా పిక్సెల్​తో మూడు వెనుక కెమెరాలుంటాయి. అందమైన సెల్ఫీలకు అనువుగా 32 మెగా పిక్సెల్​తో ముందు కెమెరా ఉంటుంది. 4500 ఎం​ఏహెచ్ సామర్థ్యమున్న ఈ మొబైల్​ బ్యాటరీని టైప్​-సీ పోర్టుతో చాలా త్వరగా ఛార్జ్​ చేసుకోవచ్చు. ఫోన్​ ధర మాత్రం ఇప్పటికీ అధికారికంగా ప్రకటించలేదు అధికారులు. 5జీ సేవలు లేకుండానే ఈ మొబైల్​ ధర రూ.45 వేలు ఉండనున్నట్లు సమాచారం.

నలుపు, తెలుపు రంగుల గెలాక్సీ ఏ90 మొబైల్​ ఫోన్లు ప్రస్తుతం దక్షిణ కొరియా వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి. రెండింటిలోనూ వెనుక భాగంలో ప్రత్యేక డిజైన్​ ఉంటుంది. 6జీబీ, 8 జీబీ ర్యామ్​లతో అందుబాటులో ఉండే ఈ ఫోన్​లో 128 జీబీ ఇంటర్నల్​ స్టోరేజ్​ ఉంటుంది. 6జీబీ ర్యామ్​ ఫోన్​లో మైక్రో ఎస్డీ కార్డు వేసుకోవచ్చు.
ఈ 5జీ సేవల ఫోన్లు భారత మార్కెట్లోకి వచ్చేందుకు మరింత సమయం పట్టనున్నట్లు శామ్​సంగ్​ సీఈఓ డీజే కోహ్​ తెలిపారు.

శామ్​సంగ్​ గెలాక్సీ ఏ90 ఫీచర్స్​

  • తెర : 6.7 అంగుళాల ఫుల్​ హెచ్​డీ+ సూపర్​ అమోలెడ్
  • ప్రాసెసర్ ​ : క్వాల్​కామ్​ స్నాప్​డ్రాగన్ 855​
  • వెనుక కెమెరాలు : 48 ఎంపీ, 8 ఎంపీ, 5 ఎంపీ
  • ముందు కెమెరా : 32 ఎంపీ
  • ర్యామ్​ : 6 జీబీ, 8 జీబీ
  • స్టోరేజ్​ : 128 జీబీ
  • బ్యాటరీ సామర్థ్యం : 4500 ఎంఏహెచ్​
  • ఇతర ఫీచర్స్​ : ఫింగర్​ ప్రింట్ సెన్సార్​, ఫేస్​ అన్​లాక్​, బ్లూటూత్​ 5.0, వైఫై 802.11, టైప్​ -సీ క్విక్​, ఛార్జింగ్​ పోర్ట్​

ఇదీ చూడండి : యూట్యూబ్​లో మాతృభాషకే వీక్షకుల జై!

Last Updated : Sep 29, 2019, 7:01 AM IST

ABOUT THE AUTHOR

...view details