శామ్‌సంగ్ ఇండియా గెలాక్సీ ఏ -31 స్మార్ట్‌ఫోన్‌ను విపణిలోకి విడుదల చేసింది. 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజి వేరియంట్ ధర రూ.21,999 నిర్ణయించింది. మైక్రో-ఎస్‌డీ కార్డ్ స్లాట్‌తో 512 జీబీ వరకు మెమోరీ సామర్థ్యం పెంచుకోవచ్చు. ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్లతో పాటు, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, శాంసంగ్ అధికారిక పోర్టల్ ద్వారా విక్రయాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.
శాంసంగ్ గెలాక్సీ ఏ-31 విక్రయాలు షురూ - శాంసంగ్ కొత్త స్మార్ట్ఫోన్లు
భారత మార్కెట్లోకి శాంసంగ్ గెలాక్సీ ఏ -31 వచ్చేసింది. గెలాక్సీ ఏ -30 కొనసాగింపుగా తీసుకువచ్చిన ఈ మోడల్ ఫీచర్లు.. ధర వంటి వివరాలు ఇలా ఉన్నాయి.
శాంసంగ్ ఏ 31 ధర
ఫీచర్లు..
- 6.4 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ సూపర్‌అమోల్డ్ ఇన్ఫినిటీ యూ డిస్‌ప్లే
- మీడియా టెక్ హీలియో పీ65 ప్రాసెసర్
- వెనుకవైపు నాలుగు కెమెరాలు (48 ఎంపీ+8ఎంపీ+5 ఎంపీ+5ఎంపీ)
- 20 మెగా పిక్సెల్స్ సెల్ఫీ కెమెరా.
- 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ
- 15వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్
- ఆండ్రాయిడ్ 10 ఓఎస్
ఇదీ చూడండి:జియోలో మరో రూ.9,093 కోట్ల విదేశీ పెట్టుబడి